Telugu Global
Cinema & Entertainment

వేడుకలు షురూ.. మెగాస్టార్ మాత్రం రాడు..

మరికొన్ని గంటల్లో మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. వేడుకలకు సంబంధించి మెగాభిమానులంతా సర్వసిద్ధమయ్యారు. చందాలు పోగేసుకొని మరీ సెలబ్రేషన్స్ చేయడానికి రెడీ. ఆటపాటతో పాటు రక్తదానం, అన్నదానం, వస్త్రదానం లాంటి ఛారిటీ కార్యక్రమాలకు కూడా రూట్ మ్యాప్ రెడీ చేశారు. రేపు సాయంత్రం శిల్పకళావేదికలో బర్త్ డే సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. మెగా హీరోలంతా వస్తారంటూ టాంటాం చేస్తున్నారు. కానీ ఎంతమంది హాజరైనా చిరంజీవి మాత్రం డుమ్మా కొట్టబోతున్నాడు. డుమ్మా కొట్టడమేంటి.. ఆల్రెడీ డుమ్మా […]

వేడుకలు షురూ.. మెగాస్టార్ మాత్రం రాడు..
X

మరికొన్ని గంటల్లో మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. వేడుకలకు సంబంధించి మెగాభిమానులంతా సర్వసిద్ధమయ్యారు. చందాలు పోగేసుకొని మరీ సెలబ్రేషన్స్ చేయడానికి రెడీ. ఆటపాటతో పాటు రక్తదానం, అన్నదానం, వస్త్రదానం లాంటి ఛారిటీ కార్యక్రమాలకు కూడా రూట్ మ్యాప్ రెడీ చేశారు. రేపు సాయంత్రం శిల్పకళావేదికలో బర్త్ డే సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. మెగా హీరోలంతా వస్తారంటూ టాంటాం చేస్తున్నారు.

కానీ ఎంతమంది హాజరైనా చిరంజీవి మాత్రం డుమ్మా కొట్టబోతున్నాడు. డుమ్మా కొట్టడమేంటి.. ఆల్రెడీ డుమ్మా కొట్టేశాడు. తన కుటుంబసభ్యులతో కలిసి ఓ అజ్ఞాత ప్రదేశానికి ఇప్పటికే చేరుకున్నారు చిరు. ఫ్యామిలీతోనే బర్త్ డే అంటూ చెప్పకనే చెప్పేశారు. సో.. చిరంజీవి లేకుండానే ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. కనీసం శిల్పకళావేదికలో జరిగే ఫంక్షన్ కైనా మెగాహీరోలు వస్తారో రారో చూడాలి.

Click to Read

మంచి మ‌గాళ్ల‌ను న‌మ్మ‌నంటున్న దీపిక ప‌దుకోణ్‌… మంచి మ‌గాళ్ల‌ను న‌మ్మ‌నంటున్న దీపిక ప‌దుకోణ్‌…

నిర్మాతల మండలిని ఘాటుగా విమర్శించిన‌ విశాల్ నిర్మాతల మండలిని ఘాటుగా విమర్శించిన‌ విశాల్

బన్నీకి ప్రవాసి రత్న పురస్కారం బన్నీకి ప్రవాసి రత్న పురస్కారం

First Published:  21 Aug 2016 2:51 AM GMT
Next Story