Telugu Global
Cinema & Entertainment

మరోసారి బ్రేక్ ఇచ్చిన మహేష్...

ఈమధ్యే మురుగదాస్ సినిమా స్టార్ట్ చేశాడు మహేష్ బాబు. అంతకంటే ముందు ఏకంగా నెల రోజుల పాటు విదేశాల్లో సరదాగా గడిపి వచ్చాడు. అయితే అంతలోనే మురుగ సినిమాకు మరోసారి బ్రేక్ పడింది. అయితే ఈసారి బ్రేక్ ఇచ్చింది మహేష్ బాబు కాదు. స్వయంగా దర్శకుడే సినిమా షెడ్యూల్ ను కొన్నాళ్ల పాటు పోస్ట్ పోన్ చేశాడు. దీనికి కారణం అకిరా సినిమా. మురుగదాస్ తన హిందీ సినిమా ‘అకిరా’ను విడుదలకు సిద్ధం చేసే పనిలో పడిపోయారు. […]

మరోసారి బ్రేక్ ఇచ్చిన మహేష్...
X

ఈమధ్యే మురుగదాస్ సినిమా స్టార్ట్ చేశాడు మహేష్ బాబు. అంతకంటే ముందు ఏకంగా నెల రోజుల పాటు విదేశాల్లో సరదాగా గడిపి వచ్చాడు. అయితే అంతలోనే మురుగ సినిమాకు మరోసారి బ్రేక్ పడింది. అయితే ఈసారి బ్రేక్ ఇచ్చింది మహేష్ బాబు కాదు. స్వయంగా దర్శకుడే సినిమా షెడ్యూల్ ను కొన్నాళ్ల పాటు పోస్ట్ పోన్ చేశాడు. దీనికి కారణం అకిరా సినిమా.

మురుగదాస్ తన హిందీ సినిమా ‘అకిరా’ను విడుదలకు సిద్ధం చేసే పనిలో పడిపోయారు. మురుగదాస్ దర్శకత్వంలో సోనాక్షి సిన్హా హీరోయిన్‍గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫైనల్ కాపీని సిద్ధం చేసే పనిలో ప్రస్తుతం మురుగదాస్ టీమ్ బిజీ బిజీగా ఉంది. మరోపక్క సోనాక్షి సిన్హా ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. విడుదలకు కొన్ని రోజుల ముందు తను కూడా ప్రచారంలో పాల్గొనాలని మురుగ ఫీల్ అవుతున్నాడు. అకిరా పనులన్నీ పూర్తయి, అది థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రమే మహేష్ సినిమా మళ్లీ పట్టాలపైకి రానుంది. అప్పటివరకు మహేష్ కు సెలవులే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న మహేష్ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు కలిసి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

First Published:  18 Aug 2016 11:05 PM GMT
Next Story