Telugu Global
Cinema & Entertainment

మరో షెడ్యూల్ ముగించిన హైపర్

ఒక సినిమాకు కమిట్ అయితే… దాన్ని కంప్లీట్ చేసేవరకు నిద్రపోడు రామ్. ప్రస్తుతం హైపర్ విషయంలో అదే చేస్తున్నాడు. పైగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించడంతో… వీలైనంత తొందరగా షెడ్యూల్స్ పూర్తిచేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగా తాజాగా వైజాగ్ షెడ్యూల్ ను ముగించాడు రామ్. నేను శైలజ హిట్ తరువాత రామ్ చేస్తున్న సినిమా కావడంతో హైపర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ […]

మరో షెడ్యూల్ ముగించిన హైపర్
X

ఒక సినిమాకు కమిట్ అయితే… దాన్ని కంప్లీట్ చేసేవరకు నిద్రపోడు రామ్. ప్రస్తుతం హైపర్ విషయంలో అదే చేస్తున్నాడు. పైగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించడంతో… వీలైనంత తొందరగా షెడ్యూల్స్ పూర్తిచేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగా తాజాగా వైజాగ్ షెడ్యూల్ ను ముగించాడు రామ్. నేను శైలజ హిట్ తరువాత రామ్ చేస్తున్న సినిమా కావడంతో హైపర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం ఆగష్టు 5 నుండి వైజాగ్ లో జరుపుకుంటున్న షూటింగ్ షెడ్యూల్ నిన్నటితో పూర్తిచేసుకుంది. ఈరోజు నుంచి హైదరాబాద్ లో మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర లు సంయుక్తంగా 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో రామ్ పాత్ర చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని, ‘ప్రతి ఇంట్లో ఒకడుంటాడు’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు అందర్నీ ఆకట్టుకుంటాయట. సెప్టెంబర్ రెండవ వారంలో ఆడియో, 30వ తేదీన సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

First Published:  18 Aug 2016 11:04 PM GMT
Next Story