పుట్టినరోజు వేడుక... పదవిని ఊడగొట్టింది!
కేరళ రవాణా కమిషనర్ టామిన్ జె థచంకరీని పదవి నుండి తప్పించారు. వివాదాస్పద ప్రవర్తనతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే టామిన్ జె థచంకరీ…తన శాఖలో ఉండటానికి వీలులేదని రాష్ట రవాణా శాఖా మంత్రి ససీంద్రన్ కేరళ ముఖ్యమంత్రిని కోరటంతో ఈ మార్పు చోటు చేసుకుంది. ఆయన స్థానంలో అడిషనల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆనందకృష్టన్ని నియమించారు. ఇటీవల ఈ నెల 10వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా ఉద్యోగులకు, ప్రజలకు స్వీట్లు, కేకులు పంచాలని […]
కేరళ రవాణా కమిషనర్ టామిన్ జె థచంకరీని పదవి నుండి తప్పించారు. వివాదాస్పద ప్రవర్తనతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే టామిన్ జె థచంకరీ…తన శాఖలో ఉండటానికి వీలులేదని రాష్ట రవాణా శాఖా మంత్రి ససీంద్రన్ కేరళ ముఖ్యమంత్రిని కోరటంతో ఈ మార్పు చోటు చేసుకుంది. ఆయన స్థానంలో అడిషనల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆనందకృష్టన్ని నియమించారు.
ఇటీవల ఈ నెల 10వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా ఉద్యోగులకు, ప్రజలకు స్వీట్లు, కేకులు పంచాలని థచంకరీ… ఉత్తర్వులు జారీ చేయటంతో అది వివాదాలకు దారితీసింది. రవాణా మంత్రి…థచంకరీ చేసిన ఉత్తర్వులు, ఆయన ప్రవర్తనపై ఒక నివేదికని తయారుచేయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఆ నివేదిక కేబినెట్ మీటింగ్‌కి అందినవెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
థచంకరీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కి సన్నిహితుడనే పేరుంది. కానీ 1987వ బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన థచంకరీ విధుల్లో చేరినప్పటినుండీ వివాదాస్పదంగానే ఉన్నారు. ఆయన రవాణా మంత్రిని సంప్రదించకుండానే ట్రాన్స్ఫర్లు చేయడం, ఐఎఎస్ అధికారులకు…వారి అధికారిక వాహనాలకు ఉన్న జాతీయ జెండాని తొలగించమని ఆదేశించడం… లాంటి వివాదాలతో వార్తల్లోకి ఎక్కారు. 2010లో ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా ఫారిన్ ట్రిప్‌కి వెళ్లినందుకు అప్పటి ముఖ్యమంత్రి విఎస్ అచ్చుతానందన్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. తరువాత వచ్చిన ఊమెన్ చండీ ప్రభుత్వంలో ఆయన తిరిగి ఉద్యోగంలో చేరారు. మరొకసారి తన ప్రవర్తనతో వివాదాస్పదుడిగా మారారు.