Telugu Global
Cinema & Entertainment

శృతిహాస‌న్ కాస్ట్యూమ్ గౌతమికి నచ్చట్లేదా... ?

స్వ‌త‌హాగా శృతిహాస‌న్ త‌న కాస్టూమ్స్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉంటుంది. పాత్ర‌కు త‌గ్గ‌ట్లు కాస్టూమ్స్ ను సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక గౌత‌మి కూడా ఒక‌ప్పటి స్టార్ హీరోయిన్. అయితే గౌత‌మి పెళ్ళి తరువాత‌ సినిమాల‌కు కాస్టూమ్స్ డిజైన్ చేస్తూ ఇండస్ట్రీతో ట‌చ్ లో వున్నారు. ఇక డైవ‌ర్స్ అయిన త‌రువాత‌.. క‌మ‌ల్ హాస‌న్ తో క‌ల‌సి వుంటున్నారు. క‌ట్ చేస్తే… ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ లీడ్ రోల్ లో శ‌భాష్ నాయుడు చిత్రం వ‌స్తుంది. ఈ చిత్రంలో శృతిహాస‌న్ […]

శృతిహాస‌న్ కాస్ట్యూమ్ గౌతమికి నచ్చట్లేదా... ?
X

స్వ‌త‌హాగా శృతిహాస‌న్ త‌న కాస్టూమ్స్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉంటుంది. పాత్ర‌కు త‌గ్గ‌ట్లు కాస్టూమ్స్ ను సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక గౌత‌మి కూడా ఒక‌ప్పటి స్టార్ హీరోయిన్. అయితే గౌత‌మి పెళ్ళి తరువాత‌ సినిమాల‌కు కాస్టూమ్స్ డిజైన్ చేస్తూ ఇండస్ట్రీతో ట‌చ్ లో వున్నారు. ఇక డైవ‌ర్స్ అయిన త‌రువాత‌.. క‌మ‌ల్ హాస‌న్ తో క‌ల‌సి వుంటున్నారు. క‌ట్ చేస్తే… ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ లీడ్ రోల్ లో శ‌భాష్ నాయుడు చిత్రం వ‌స్తుంది. ఈ చిత్రంలో శృతిహాస‌న్ ఒక కీరోల్ చేస్తుంది. అలాగే ఈ సినిమాకు గౌతమి కాస్ట్యూమ్ స్టైలిస్ట్‌గా పనిచేస్తున్నారు. అయితే కాస్ట్యూమ్స్‌ విషయంలో శ్రుతికీ, గౌతమికీ మధ్య భేదాభిప్రాయాలు చోటు చేసుకొన్నాయని, ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగిందని ప్రచారం సాగింది. దీనిపై శ్రుతిహాసన్‌ స్పందించింది. తన ప్రతినిధి ద్వారా ఒక ప్రకటనను విడుదల చేయించింది. ఆ ప్ర‌క‌ట‌న సారంశం ఏమిటంటే.. త‌మ మ‌ధ్య కాస్ట్యూమ్స్ ఏవి ధరించాలనే దానిపై ఎటువంటి విభేదం రాలేదని కేవలం ఒక డిస్క‌ష‌న్ మాత్రమే జరిగిందని అని తెలిపారు. ఇక ఈ మ‌ద్య మ‌న‌మంతా చిత్రంలో గౌత‌మి యాక్టింగ్ కు ఆడియ‌న్స్ నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చిన విష‌య‌మే తెలిసింది.

Click to Read

శ్రుతి హాసన్ గౌతమిపై ప్రతీకారం తీర్చుకుంటున్నదా? శ్రుతి హాసన్ గౌతమిపై ప్రతీకారం తీర్చుకుంటున్నదా?

మెడల్స్ ఇస్తే సరిపోదు, డబ్బులివ్వండి – అక్షయ్ మెడల్స్ ఇస్తే సరిపోదు, డబ్బులివ్వండి – అక్షయ్

First Published:  17 Aug 2016 12:09 AM GMT
Next Story