Telugu Global
National

ఇక డ్యూటీలో ఉండి డ్రింక్ చేస్తే...పైల‌ట్ల‌కు జైలుశిక్షే!

పైల‌ట్లు, విమాన సిబ్బంది…విమానం న‌డుస్తుండ‌గా డ్రింకుచేయ‌డాన్ని పౌర‌విమాన‌యాన శాఖ‌ డైర‌క్ట‌రేట్ జ‌న‌ర‌ల్ సంస్థ (డిజిసిఎ) ఇక‌పై తీవ్రంగా ప‌రిగ‌ణించ‌నుంది.  ఇప్ప‌టివ‌ర‌కు…ఈ నేరానికి ఐదేళ్ల‌పాటు వారి ప్ల‌యింగ్ లైసెన్సుని ర‌ద్దు చేయడాన్ని శిక్ష‌గా విధిస్తున్నారు. అయితే త్వ‌ర‌లో ఈ శిక్షని మ‌రింత తీవ్రం చేయ‌నున్నారు. ఇటీవ‌ల ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్‌కి చెందిన ఇరువురు పైలట్లు విమానం దిగిన త‌రువాత…శ్వాస ప‌రీక్ష‌లో తాగి ఉన్న‌ట్టుగా రుజువు కావ‌టంతో… వారిద్ద‌రిపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా పౌర‌విమాన‌యాన శాఖ డైర‌క్ట‌రేట్ జ‌న‌ర‌ల్ […]

పైల‌ట్లు, విమాన సిబ్బంది…విమానం న‌డుస్తుండ‌గా డ్రింకుచేయ‌డాన్ని పౌర‌విమాన‌యాన శాఖ‌ డైర‌క్ట‌రేట్ జ‌న‌ర‌ల్ సంస్థ (డిజిసిఎ) ఇక‌పై తీవ్రంగా ప‌రిగ‌ణించ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు…ఈ నేరానికి ఐదేళ్ల‌పాటు వారి ప్ల‌యింగ్ లైసెన్సుని ర‌ద్దు చేయడాన్ని శిక్ష‌గా విధిస్తున్నారు. అయితే త్వ‌ర‌లో ఈ శిక్షని మ‌రింత తీవ్రం చేయ‌నున్నారు. ఇటీవ‌ల ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్‌కి చెందిన ఇరువురు పైలట్లు విమానం దిగిన త‌రువాత…శ్వాస ప‌రీక్ష‌లో తాగి ఉన్న‌ట్టుగా రుజువు కావ‌టంతో… వారిద్ద‌రిపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా పౌర‌విమాన‌యాన శాఖ డైర‌క్ట‌రేట్ జ‌న‌ర‌ల్ సంస్థ ఆదేశించింది.

వారికి ఒక సంవ‌త్సరం పాటు జైలుశిక్ష‌, ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌రిమానా విధించే అవ‌కాశం ఉంద‌ని, విమాన సిబ్బందిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం ఇదే మొద‌టిసార‌ని…ఇక‌పై ఈ విష‌యంలో ఇలాగే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నామ‌ని డిజిసిఎ అధికారులు వెల్ల‌డించారు. ఆ ఇరువురు పైల‌ట్ల‌కు నాలుగేళ్ల‌పాటు లైసెన్సుల‌ను ర‌ద్దు చేశారు. డిజిసిఎ విమాన ర‌క్ష‌ణ విభాగం… ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్ సంస్థ‌ల‌ను…ఆ ఇద్ద‌రు పైల‌ట్ల‌మీద పోలీసుల‌కు కంప్ల‌యింట్ చేసిన‌ట్టుగా ధృవీక‌రించే ప‌త్రాల‌ను త‌మ‌కు పంపాల్సిందిగా కోరింది. క్యాబిన్ సిబ్బందిపై కూడా కేసు పెట్టాల్సిందిగా ఎయిర్ ఇండియాను ఆదేశించింది. ఇప్ప‌టివ‌ర‌కు పైల‌ట్లు విమానం ఎక్కేముందు మెడిక‌ల్ టెస్టులో ఫెయిల‌యితే మొద‌టిసారి మూడునెల‌లు, రెండ‌వ‌సారి మూడేళ్లు, మూడో సారి అయితే అయిదేళ్లు ఫ్ల‌యింగ్ లైసెన్సుల‌ను డిజిసిఎ ర‌ద్దు చేస్తున్న‌ది. పైల‌ట్లు విమానం దిగిన త‌రువాత తాగి ఉన్న‌ట్టుగా తేలితే ఈ కాల వ్య‌వ‌ధి ఒక సంవ‌త్స‌రం పెరుగుతుంది. అయితే పైల‌ట్లు డ్రింకు చేసిన‌పుడు పోలీసు కేసువ‌ర‌కు వెళ్లిన సంద‌ర్భం 2014లో ఒక‌టి ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. జిఎమ్మార్ గ్రూపు డాక్ట‌రు… వారి కంపెనీ పైల‌ట్ల‌కు శ్వాస పరీక్ష చేయ‌కుండానే రిపోర్టులు ఇస్తున్నార‌ని తేల‌టంతో ఈ విష‌యం పోలీసు కేసు వ‌రకు వెళ్లింది.

అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఈ నేరానికి లైసెన్సుల‌ను ర‌ద్దు చేయ‌టంతో స‌రిపెడుతుండ‌గా…విమాన సిబ్బంది ప‌దేప‌దే ఇలాంటి నేరాల‌కు పాల్ప‌డుతుండ‌టంతో దీనిపై పౌర‌విమాన‌యాన శాఖ డైర‌క్ట‌రేట్ జ‌న‌ర‌ల్ సంస్థ మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌నే నిర్ణ‌యం తీసుకుంది. విమాన‌యాన శాఖా మంత్రి జయంత్ సిన్హా గ‌త నెల‌లో పార్ల‌మెంటులో…గ‌త మూడేళ్ల కాలంలో 122మంది పైల‌ట్లు ప్ర‌యాణానికి ముందు శ్వాస ప‌రీక్ష‌లో డ్రింక్ చేసిన‌ట్టుగా తేలింద‌ని… తెలిపిన నేప‌థ్యంలో ఈ స‌మ‌స్య తీవ్ర‌త‌ని మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు.

First Published:  12 Aug 2016 11:07 PM GMT
Next Story