Telugu Global
Cinema & Entertainment

ఆమెకు ప్రమోషన్ ఇచ్చిన బన్నీ...

మొన్నటివరకు ఆమె సెకెండ్ హీరోయిన్. ప్రస్తుతం ఆమె ఒప్పుకుంటున్న సినిమాలు కూడా సెకెండ్ హీరోయిన్ పాత్రలే. ఆమె పేరు క్యాథరీన్ థ్రెసా. బన్నీ నటించిన “ఇద్దరమ్మాయిలతో” సినిమాతో పాపులర్ అయింది. తాజాగా వచ్చిన రేసుగుర్రంలో సెకెండ్ హీరోయిన్ పాత్ర చేసింది. రానా, గోపీచంద్ లాంటి హీరోల సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ గా నటించేందుకు ఒప్పుకుంది. ఇప్పుడీ హీరోయిన్ కు ప్రమోషన్ ఇవ్వాలని బన్నీ అనుకుంటున్నాడట. కుదిరితే తన నెక్ట్స్ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్రను ఆమెకే ఇవ్వాలని […]

ఆమెకు ప్రమోషన్ ఇచ్చిన బన్నీ...
X

మొన్నటివరకు ఆమె సెకెండ్ హీరోయిన్. ప్రస్తుతం ఆమె ఒప్పుకుంటున్న సినిమాలు కూడా సెకెండ్ హీరోయిన్ పాత్రలే. ఆమె పేరు క్యాథరీన్ థ్రెసా. బన్నీ నటించిన “ఇద్దరమ్మాయిలతో” సినిమాతో పాపులర్ అయింది. తాజాగా వచ్చిన రేసుగుర్రంలో సెకెండ్ హీరోయిన్ పాత్ర చేసింది. రానా, గోపీచంద్ లాంటి హీరోల సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ గా నటించేందుకు ఒప్పుకుంది. ఇప్పుడీ హీరోయిన్ కు ప్రమోషన్ ఇవ్వాలని బన్నీ అనుకుంటున్నాడట. కుదిరితే తన నెక్ట్స్ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్రను ఆమెకే ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

త్వరలోనే హరీష్ శంకర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు బన్నీ. రొమాంటిక్ ఎఁటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మొదట శృతిహాసన్ ను అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది. రకుల్ ను అనుకున్నారు. కానీ ఆమె మహేష్ సినిమాతో బిజీ. సమంతను సంప్రదిస్తే… ఆమె సినిమాల నుంచి తప్పుకున్నానని చెప్పేసింది. ఇవన్నీ క్యాథరీన్ కు బాగా కలిసొచ్చాయనే చెప్పాలి. అన్నీ అనుకున్నట్టు జరిగితే బన్నీ రాబోయే సినిమాలో క్యాథరీన్ మెయిన్ హీరోయిన్.

Click on Image to Read:

pawan trivikram

First Published:  8 Aug 2016 9:25 PM GMT
Next Story