Telugu Global
Cinema & Entertainment

సంచలనానికి ఏడాది పూర్తి

ఏదో సినిమాలో త్రివిక్రమ్ చెప్పినట్టు అద్భుతం జరిగినప్పుడు ఎవరూ గుర్తించలేరు. జరిగిన తర్వాత దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు. అది చరిత్రలో నిలిచిపోతుంది. నలుగురి నోళ్లలో నానుతుంది. పుస్తకాల్లోకి కూడా ఎక్కుతుంది. సరిగ్గా అలాంటి అద్భుతమే ఏడాది కిందట సాక్షాత్కారం జరిగింది. అదే మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా. బాహుబలి మేనియాలో దేశమంతా ఊగిపోతున్న టైమ్ లో.. సరిగ్గా వారం గ్యాప్ లో వచ్చిన ఈ సిినిమా… ఆ మెగామూవీని తట్టుకొని నిలబడ్డమే కాకుండా… మహేష్ కెరీర్ […]

సంచలనానికి ఏడాది పూర్తి
X

ఏదో సినిమాలో త్రివిక్రమ్ చెప్పినట్టు అద్భుతం జరిగినప్పుడు ఎవరూ గుర్తించలేరు. జరిగిన తర్వాత దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు. అది చరిత్రలో నిలిచిపోతుంది. నలుగురి నోళ్లలో నానుతుంది. పుస్తకాల్లోకి కూడా ఎక్కుతుంది. సరిగ్గా అలాంటి అద్భుతమే ఏడాది కిందట సాక్షాత్కారం జరిగింది. అదే మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా. బాహుబలి మేనియాలో దేశమంతా ఊగిపోతున్న టైమ్ లో.. సరిగ్గా వారం గ్యాప్ లో వచ్చిన ఈ సిినిమా… ఆ మెగామూవీని తట్టుకొని నిలబడ్డమే కాకుండా… మహేష్ కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా…. ప్రజలకు ఓ మంచి సందేశాన్ని కూడా ఇచ్చింది. గతేడాది ఆగస్ట్ 7న విడుదలైన ఈ సినిమా ఈరోజుతో ఏడాది పూర్తి చేసుకుంది.

సినిమా వచ్చి అప్పుడే ఏడాది అయిపోయిందా అనేంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది శ్రీమంతుడు. నిజమే… ఎఁదుకంటే.. ఈ సినిమా గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. కొరటాల-మహేష్ కాంబినేషన్ గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారు. దీనికి తోడు కొరటాలకు మహేష్ బాబు మరో ఛాన్స్ ఇవ్వడంతో… శ్రీమంతుడు టాపిక్ ఈమధ్య కాలంలో ఇంకా ఎక్కువైంది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు-శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. రాజేంద్రప్రసాద్, జగపతిబాబు తమ పాత్రలకు ప్రాణం పోస్తే… దేవిశ్రీప్రసాద్ తన మ్యూజిక్ తో సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లాడు. అలా అన్ని కలిసొచ్చి శ్రీమంతుడు సినిమా చరిత్రలో నిలిచిపోయింది.

First Published:  6 Aug 2016 11:21 PM GMT
Next Story