Telugu Global
Cinema & Entertainment

ఈసారి కుర్రాళ్లపై కన్నేశాడు...

దర్శకుడు పూరి జగన్నాధ్ ఎప్పుడు ఏ సినిమా ఎనౌన్స్ చేసినా అందులో ఓ స్టార్ హీరో కనిపిస్తాడు. అవును… ఇన్నాళ్లూ స్టార్స్ తో మాత్రమే సినిమాలు చేశాడు పూరి జగన్నాధ్. కుర్రహీరోలతో కలిసి వర్క్ చేయాలని ఉన్నప్పటికీ… ఆ అవకాశం పూరికి దొరకలేదు. నిత్యం స్టార్ హీరోల సినిమాలతోనే అయిపోయింది. ఎట్టకేలకు పూరి జగన్నాధ్.. కుర్రహీరోలతో సినిమాకు సై అంటున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే… నాగశౌర్య, విజయ్ దేవరకొండ హీరోలుగా పూరీ జగన్నాద్ దర్శకత్వంలో ఓ సినిమా […]

ఈసారి కుర్రాళ్లపై కన్నేశాడు...
X

దర్శకుడు పూరి జగన్నాధ్ ఎప్పుడు ఏ సినిమా ఎనౌన్స్ చేసినా అందులో ఓ స్టార్ హీరో కనిపిస్తాడు. అవును… ఇన్నాళ్లూ స్టార్స్ తో మాత్రమే సినిమాలు చేశాడు పూరి జగన్నాధ్. కుర్రహీరోలతో కలిసి వర్క్ చేయాలని ఉన్నప్పటికీ… ఆ అవకాశం పూరికి దొరకలేదు. నిత్యం స్టార్ హీరోల సినిమాలతోనే అయిపోయింది. ఎట్టకేలకు పూరి జగన్నాధ్.. కుర్రహీరోలతో సినిమాకు సై అంటున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే… నాగశౌర్య, విజయ్ దేవరకొండ హీరోలుగా పూరీ జగన్నాద్ దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలపైకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

తాజాగా వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో విజయ్ దేవరకొండ మంచి మార్కులు తెచ్చుకున్నాడు. హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊహలు గుసగుసలాడే, లక్ష్మీరావే మాఇంటికి లాంటి సినిమాలతో హీరోగా బాగా పాపులర్ అయిపోయాడు. ఇప్పుడీ ఇద్దర్నీ పెట్టి పూరీ జగన్నాధ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. తన సొంత బ్యానర్ లోనే… ఈ ఇద్దరితో ఓ లో-బడ్జెట్ సినిమా చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఈ ప్రాజెక్టు ఉంది. కల్యాణ్ రామ్ తో పూరి చేస్తున్న ఇజం సినిమా కంప్లీట్ అయిన తర్వాత… ఈ మినీ-మల్టీస్టారర్ పై క్లారిటీ వస్తుంది.

First Published:  6 Aug 2016 11:25 PM GMT
Next Story