Telugu Global
Cinema & Entertainment

పైరసీకే పెద్ద దెబ్బ

యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం గంటల వ్యవధిలో వచ్చి పడిపోయేది. రోజుకు లక్షల మంది విజిటర్లు. మొన్నటివరకు టోరెట్జ్ వైభోగం ఇది. ఎక్కడుంటారో తెలీదు.. ఏం చేస్తుంటారో తెలీదు… ఎలా చేస్తారో కూడా తెలీదు. సైట్ లో మాత్రం భాషతో సంబంధం లేకుండా సినిమా అప్ లోడ్ అయిపోతుంది. పీర్స్, లైఫ్, సీడ్స్ అంటూ ఎన్నో ఆప్షన్లు. డౌన్ లోడ్ పెట్టుకున్నోడికి పెట్టుకున్నంత. ఇలా పైరసీని ఓ సామ్రాజ్యంగా మార్చేసిన టోరెట్జ్ కథ […]

పైరసీకే పెద్ద దెబ్బ
X
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం గంటల వ్యవధిలో వచ్చి పడిపోయేది. రోజుకు లక్షల మంది విజిటర్లు. మొన్నటివరకు టోరెట్జ్ వైభోగం ఇది. ఎక్కడుంటారో తెలీదు.. ఏం చేస్తుంటారో తెలీదు… ఎలా చేస్తారో కూడా తెలీదు. సైట్ లో మాత్రం భాషతో సంబంధం లేకుండా సినిమా అప్ లోడ్ అయిపోతుంది. పీర్స్, లైఫ్, సీడ్స్ అంటూ ఎన్నో ఆప్షన్లు. డౌన్ లోడ్ పెట్టుకున్నోడికి పెట్టుకున్నంత. ఇలా పైరసీని ఓ సామ్రాజ్యంగా మార్చేసిన టోరెట్జ్ కథ ముగిసింది. ఈ సైట్ షట్ డౌన్ అయింది. ఈరోజు తెల్లారి నుంచి టోరెంట్జ్ ఓపెన్ చేసిన వాళ్లకు ఒకటే సమాధానం. టోరెట్జ్ విల్ ఆల్వేజ్ లవ్ యు. ఫేర్ వెల్ అనే సందేశం మాత్రమే కనిపిస్తోంది.
వాస్తవానికి కొన్నేళ్లుగా టోరెట్జ్ పై ఒత్తిడి పెరిగింది. ఈ సైట్ కు నిధుల ప్రవాహాన్ని ఆపేశారు. వేలాది ఇంటర్నెట్ లింకుల్ని కట్ చేశారు. 13 ఏళ్లుగా హాలీవుడ్ ను వణికించిన ఈ టోరెట్జ్.ఈయు అనే సైట్ ను నిలిపేసేందుకు హాలీవుడ్ నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు చేయాల్సిందంతా చేశారు. అయితే సడెన్ గా… తమ సైట్ ను టోరెెంట్జ్ నిలిపివేయడం మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. మొత్తమ్మీద 13 ఏళ్ల టోరెంట్జ్ కథ ముగిసింది.అతి పెద్ద పైరసీ బెడద నుంచి చిత్రపరిశ్రమలు స్వల్పంగా కోలుకున్నాయి.
torrentz1
First Published:  6 Aug 2016 12:30 PM GMT
Next Story