Telugu Global
Cinema & Entertainment

నేను శైలజ దర్శకుడికి వెంకీ గ్రీన్ సిగ్నల్

నేను శైలజ సినిమాతో దర్శకుడు కిషోర్ తిరుమల పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. సునిశితమైన భావోద్వేగాల్ని అద్భుతంగా తెరపై చూపించడంలో కిషోర్ తిరుమల వందకు వంద మార్కులు తెచ్చుకున్నాడు. ఈ దర్శకుడు తన రెండో ప్రయత్నంగా విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయడానికి కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమా పక్కా అయింది. కిషోర్ తిరుమల చెప్పిన కథకు విక్టరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అక్టోబర్ నుంచి కిషోర్ తిరుమల-వెంకీ కాంబినేషన్ లో సినిమా […]

నేను శైలజ దర్శకుడికి వెంకీ గ్రీన్ సిగ్నల్
X
నేను శైలజ సినిమాతో దర్శకుడు కిషోర్ తిరుమల పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. సునిశితమైన భావోద్వేగాల్ని అద్భుతంగా తెరపై చూపించడంలో కిషోర్ తిరుమల వందకు వంద మార్కులు తెచ్చుకున్నాడు. ఈ దర్శకుడు తన రెండో ప్రయత్నంగా విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయడానికి కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమా పక్కా అయింది. కిషోర్ తిరుమల చెప్పిన కథకు విక్టరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అక్టోబర్ నుంచి కిషోర్ తిరుమల-వెంకీ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించనున్నారు. బాబు బంగారం సినిమా విడుదలైన తర్వాత ఈ కాంబినేషన్ పై మరిన్ని వివరాలు బయటకు రాబోతున్నాయి. అయితే సాలాఖదూస్ సినిమా రీమేక్ లో వెంకీ నటించడానికి ఒప్పుకున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏది ముందు సెట్స్ పైకి వస్తుందనేది వేచి చూడాలి. ప్రస్తుతం వెంకీ దృష్టి మొత్తం బాబు బంగారం సినిమాపైనే ఉంది. ఇది థియేటర్లలోకి వచ్చిన తర్వాత నెక్ట్స్ ప్రాజెక్టుపై క్లారిటీ వస్తుంది.
First Published:  5 Aug 2016 10:19 PM GMT
Next Story