Telugu Global
Cinema & Entertainment

ఎంజాయ్ మెంట్ లోకి నిత్యామీనన్ కూడా చేరిపోయింది...

ప్రస్తుతం జనతా గ్యారేజ్ షూటింగ్ కేరళ లోని అందమైన ప్రదేశాలు, జలపాతాల మధ్య జరుగుతోంది. ఈ షూటింగ్ లో ఎన్టీఆర్-సమంత పాల్గొంటున్నారు. అయితే కేవలం ఏదో షూటింగ్ చేసి వెళ్లిపోకుండా… హీరోహీరోయిన్లతో పాటు టోటల్ యూనిట్ అంతా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూనే… షూటింగ్ ను పిక్నిక్ లా ఆస్వాదిస్తున్నారు. తాజాగా దర్శకుడు కొరటాలను ఆటపట్టిస్తూ సమంత పెట్టిన ఓ పిక్ కూడా నెట్ లో వైరల్ అయింది. ఇప్పుడీ ఎంజాయ్ మెంట్ […]

ఎంజాయ్ మెంట్ లోకి నిత్యామీనన్ కూడా చేరిపోయింది...
X

ప్రస్తుతం జనతా గ్యారేజ్ షూటింగ్ కేరళ లోని అందమైన ప్రదేశాలు, జలపాతాల మధ్య జరుగుతోంది. ఈ షూటింగ్ లో ఎన్టీఆర్-సమంత పాల్గొంటున్నారు. అయితే కేవలం ఏదో షూటింగ్ చేసి వెళ్లిపోకుండా… హీరోహీరోయిన్లతో పాటు టోటల్ యూనిట్ అంతా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూనే… షూటింగ్ ను పిక్నిక్ లా ఆస్వాదిస్తున్నారు. తాజాగా దర్శకుడు కొరటాలను ఆటపట్టిస్తూ సమంత పెట్టిన ఓ పిక్ కూడా నెట్ లో వైరల్ అయింది. ఇప్పుడీ ఎంజాయ్ మెంట్ లోకి నిత్యామీనన్ కూడా చేరిపోయింది. సమంత ఫొటోే పెట్టిన కొన్ని గంటలకే నిత్యామీనన్ కూడా రియాక్ట్ అయింది. నేను కూడా వస్తున్నా రెడీగా ఉండండి అంటూ మరో ఫొటో పెట్టింది. ఇవాళ్టి నుంచి ఎన్టీఆర్-నిత్యామీనన్ మధ్య వచ్చే సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న జనతా గ్యారేజీ సినిమాను వచ్చేనెల 2న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈనెల 12న ఈ సినిమా ఆడియోను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో… జనతా గ్యారేజ్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

First Published:  3 Aug 2016 10:40 PM GMT
Next Story