Telugu Global
Cinema & Entertainment

కొరటాలపై సమంత రౌడీయిజం

ఈ ఫొటో చూశారా… చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంది. జనతా గ్యారేజీ వర్కింగ్ స్టిల్ ఇది. ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుగుతోంది. వర్షం నేపథ్యంలో సాంగ్. హీరోహీరోయిన్లు తడుస్తూ చిందేయాలి. పాట రక్తికట్టాలి. అదే కాన్సెప్ట్. కానీ సరిగ్గా ఇక్కడే సమంత తన రౌడీయిజం చూపించింది. దర్శకుడు ముందు తడిస్తే తప్ప తను తడవనని కండిషన్ పెట్టింది. దీంతో కొరటాలకు తప్పలేదు. హీరోయిన్ కంటే ముందే తను తడిచాడు. తర్వాతే షాట్ ఓకే అయింది. ఇదంతా […]

కొరటాలపై సమంత రౌడీయిజం
X
ఈ ఫొటో చూశారా… చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంది. జనతా గ్యారేజీ వర్కింగ్ స్టిల్ ఇది. ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుగుతోంది. వర్షం నేపథ్యంలో సాంగ్. హీరోహీరోయిన్లు తడుస్తూ చిందేయాలి. పాట రక్తికట్టాలి. అదే కాన్సెప్ట్. కానీ సరిగ్గా ఇక్కడే సమంత తన రౌడీయిజం చూపించింది. దర్శకుడు ముందు తడిస్తే తప్ప తను తడవనని కండిషన్ పెట్టింది. దీంతో కొరటాలకు తప్పలేదు. హీరోయిన్ కంటే ముందే తను తడిచాడు. తర్వాతే షాట్ ఓకే అయింది. ఇదంతా చాలా ఫన్నీగా జరిగింది. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ ఖాతాలో పెట్టుకొచ్చింది.
ఎవరి మీదైనా మీరు రౌడీయిజం ప్రదర్శించాలనుకుంటున్నారా… అయితే కొరటాలకు మించిన సరైన వ్యక్తి మీకు దొరకడు అంటూ సరదాగా దర్శకుడ్ని ఆటపట్టించింది. కొరటాల అంత సాఫ్ట్ గా, సౌమ్యంగా ఉంటాడని సమంత అభిప్రాయం. తన కామెంట్ తో పాటు.. ఇదిగో ఈ పిక్ ను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసి నందమూరి ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపింది. కేరళ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అవుతంది. ఈనెల 12న జనతా గ్యారేజీ పాటల్ని విడదల చేస్తారు. సినిమాను వచ్చేనెల 2న థియేటర్లలోకి తీసుకొస్తారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
First Published:  3 Aug 2016 2:21 AM GMT
Next Story