Telugu Global
NEWS

మళ్లీ రోడ్డెక్కిన గొట్టిపాటి

ఎమ్మెల్యే పదవికి అధికార పార్టీ అన్న ట్యాగ్‌ కూడా జత అయితే తిరుగుండదనుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఎత్తులు టీడీపీలో పారుతున్నట్టు కనిపించడం లేదు. తాజాగా మరోసారి గొట్టిపాటికి టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం నుంచి చుక్కెదురైంది. ఎమ్మెల్యే టెంట్లు వేసి మరీ తన వారికి ఫించన్లు పంపిణీ చేసేందుకు సిద్ధపడగా కరణం బలరాం అడ్డుకున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక.. విషయాన్ని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించుకుని గొట్టిపాటి సరిపెట్టుకున్నారు. అసలు వివాదం […]

మళ్లీ రోడ్డెక్కిన గొట్టిపాటి
X

ఎమ్మెల్యే పదవికి అధికార పార్టీ అన్న ట్యాగ్‌ కూడా జత అయితే తిరుగుండదనుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఎత్తులు టీడీపీలో పారుతున్నట్టు కనిపించడం లేదు. తాజాగా మరోసారి గొట్టిపాటికి టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం నుంచి చుక్కెదురైంది. ఎమ్మెల్యే టెంట్లు వేసి మరీ తన వారికి ఫించన్లు పంపిణీ చేసేందుకు సిద్ధపడగా కరణం బలరాం అడ్డుకున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక.. విషయాన్ని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించుకుని గొట్టిపాటి సరిపెట్టుకున్నారు. అసలు వివాదం ఏమిటంటే..

గొట్టిపాటి టీడీపీలో చేరిన సమయంలో తన వారి కోసం 2600 ఫించన్లు మంజూరు చేయాలని చంద్రబాబును కోరారు. అందుకు ఆయన కూడా అంగీకరించారు. ఈవిషయం తెలుసుకున్న కరణం బలరాం కూడా తన వర్గం వారి కోసం 2600 పించన్లు మంజూరు చేయాలంటూ పోటీగా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ప్రభుత్వం మాత్రం రెండు విజ్ఞాపనలను పరిశీలించి చివరకు మొత్తం 2600 పించన్లు విడుదల చేసింది. ఇక్కడే గొడవ మొదలైంది. 2600 పించన్లు మొత్తం తన కోసం మంజూరు చేసినవేనంటూ ఎమ్మెల్యే గొట్టిపాటి ప్రచారం చేసుకున్నారు. డప్పు కొట్టి మరీ తన వారికి పించన్లు ఇచ్చేందుకు ప్రకాశం జిల్లా బల్లికురవలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన కరణం బలరాం … మాట్లాడే పని ఉందంటూ అధికారులను పిలుచుకుని ఫైర్ అయ్యారు. దీంతో పించన్ల పంపిణీ కార్యక్రమం ఆగిపోయింది. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అయినా బలరాం ముందు గొట్టిపాటి వర్గం ఏమీ చేయలేకపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని… అధికారులపై చర్యలు తీసుకోవాలని గొట్టిపాటి డిమాండ్ చేసి సరిపెట్టుకున్నారు.

Also Read:

త‌మ‌న్నా దృష్టి ఎప్పుడు దాని పైనే..!

డబ్బు కోసం నేను అలా చేయను…

సన్నీలియోన్ మనస్సు దోచుకున్న బాహుబలి

నాకంటే గొప్పొళ్లున్నారు అంటున్న స‌మంత‌..!

సెక్స్ అడిక్ట్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్…

వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి…

నా చావు నేను చ‌స్తా అంటున్న రాజ‌మౌళి!

Click on Image to Read:

Sadguru Jaggi Vasudev chandrababu naidu

jc-diwakar-reddy

undavalli

mallanna sagar project villages

tdp media

sujana chowdary

anam vivekananda reddy

devineni nehuru

chandrababu english

ys jagan

chandrababu-delhi-tour

manchu manoj

balakrishna priyadarshini ram

ys jagan

ntr statue

comedian sudhakar

First Published:  3 Aug 2016 3:20 AM GMT
Next Story