Telugu Global
International

TCA ఉత్సవాలకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ

తెలుగు భాషా, సంస్కృతి అభివృద్ధి కోసం అమెరికా వేదికగా కృషి చేస్తున్న తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) విజయవంతంగా 40 వసంతాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 2 నుంచి తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. హోస్టన్‌ వేదికగా సెప్టెంబర్‌ రెండు నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈవెంట్‌కు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారయణ, సీనియర్ నటుడు తనికెళ్ల భరణిలు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. పలువురు ప్రముఖులు, సినీతారలు, కళకారులు హాజరవుకానున్నారు. తెలుగు […]

TCA ఉత్సవాలకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ
X

తెలుగు భాషా, సంస్కృతి అభివృద్ధి కోసం అమెరికా వేదికగా కృషి చేస్తున్న తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) విజయవంతంగా 40 వసంతాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 2 నుంచి తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. హోస్టన్‌ వేదికగా సెప్టెంబర్‌ రెండు నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈవెంట్‌కు
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారయణ, సీనియర్ నటుడు తనికెళ్ల భరణిలు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. పలువురు ప్రముఖులు, సినీతారలు, కళకారులు హాజరవుకానున్నారు. తెలుగు భాషా, సంస్కృతి కోసం కృషి చేస్తున్న వారిని TCA సన్మానించనుంది. తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) నార్త్ అమెరికాలోనే అత్యంత సుధీర్ఘమైన చరిత్ర ఉన్న అసోసియేషన్. ఇప్పటి వరకు వేలాదిమంది కళాకారులకు అండగా నిలవడంతో పాటు అనేక కార్యక్రమాలను నిర్వహించింది.

dc49c95a-dbf1-4614-9210-832cb6d92143

Next Story