Telugu Global
NEWS

ఇలా అయితే చిత్ర యూనిట్లు చెన్నై వెళ్లిపోతాయి...

విశాఖలో జూనియర్ ఆర్టిస్ట్ సంఘం సభ్యులు కొందరు నిర్మాత అచ్చిబాబుపై దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. గొడవ తేలే వరకు విశాఖలో షూటింగ్‌లు బంద్‌ చేస్తున్నట్టు ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రకటించేంత స్థాయికి పరిస్థితి వెళ్లింది. విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో కొద్ది రోజులుగా మంచు మనోజ్ హీరోగా నటిస్తున్నసినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి అచ్చిబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్‌కు అవసరమైన జూనియర్ ఆర్టిస్టులను స్థానికంగా కొందరు ఏజెంట్లు సమకూరుస్తున్నారు. 20 రోజుల షూటింగ్‌కు గాను […]

ఇలా అయితే చిత్ర యూనిట్లు చెన్నై వెళ్లిపోతాయి...
X

విశాఖలో జూనియర్ ఆర్టిస్ట్ సంఘం సభ్యులు కొందరు నిర్మాత అచ్చిబాబుపై దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. గొడవ తేలే వరకు విశాఖలో షూటింగ్‌లు బంద్‌ చేస్తున్నట్టు ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రకటించేంత స్థాయికి పరిస్థితి వెళ్లింది. విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో కొద్ది రోజులుగా మంచు మనోజ్ హీరోగా నటిస్తున్నసినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి అచ్చిబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

షూటింగ్‌కు అవసరమైన జూనియర్ ఆర్టిస్టులను స్థానికంగా కొందరు ఏజెంట్లు సమకూరుస్తున్నారు. 20 రోజుల షూటింగ్‌కు గాను జూనియర్ ఆర్టిస్టులకు రూ. 9లక్షలు బిల్లు అయింది. అయితే రూ. 5లక్షలు చెల్లించిన నిర్మాత అచ్చిబాబు మిగిలిన డబ్బు చెల్లించకుండా తిప్పుకుంటున్నారని జూనియర్‌ ఆర్టిస్ట్ సంఘం ఆరోపణ. ఈ నేపథ్యంలో హీరో, దర్శకుడు, నిర్మాత బస చేసిన హోటల్‌కు వెళ్లిన జూ. ఆర్టిస్ట్‌ సంఘం సభ్యులు అక్కడ గొడవ పడ్డారు. నిర్మాత అచ్చిబాబును గదిలో నుంచి ఈడ్చుకొచ్చి కొట్టారని మంచు మనోజ్ ఆరోపించారు. ఇలాంటి ఆర్టిస్టుల వల్ల విశాఖకు చెడ్డపేరు వస్తోందన్నారు. 20 నుంచి 30 మంది బాగా తాగి వచ్చి నిర్మాతపై దాడి చేశారని చెప్పారు. గొడవ తేలే దాకా విశాఖలో షూటింగ్‌లు చేయబోమన్నారు. ఈ మేరకు ప్రొడ్యూసర్ కౌల్సిల్ నిర్ణయం తీసుకుందన్నారు. అచ్చిబాబుపై దాడి ఘటనలో పరవాడ పీఎస్‌లో ఫిర్యాదు చేశామన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే చిత్రయూనిట్లు చెన్నై తరలివెళ్తాయని మంచు మనోజ్, దర్శకుడు అజయ్ హెచ్చరించారు.

జూనియర్ ఆర్టిస్ట్ సంఘం నాయకుడు వెంకట్రావ్ మాత్రం మంచుమనోజ్ వ్యాఖ్యలను ఖండించారు. తాము విశాఖలో వందలాది సినిమాలకు పనిచేశామని ఏ ఒక్కరుకూడా తమపై ఇలా ఆరోపణలు చేయలేదన్నారు. డబ్బు చెల్లించాల్సిందిగా కోరడం కూడా తప్పంటే ఎలా అని ప్రశ్నించారు. నిర్మాతపై తాము దాడి చేయలేదని డబ్బు అడిగేందుకు మాత్రమే వెళ్లామన్నారు. మంచు మనోజ్ పూర్తి వివరాలు తెలుసుకుని మాట్లాడాలని వెంకట్రావ్ కోరారు. గుర్తింపు కార్డు లేని ఆర్టిస్టులను తాను షూటింగ్‌లకు పంపడం లేదన్నారు.

Also Read:

డబ్బు కోసం నేను అలా చేయను…

సన్నీలియోన్ మనస్సు దోచుకున్న బాహుబలి

అది అంత తేలికైన విషయం కాదు..అలియ‌భ‌ట్‌..!

నాకంటే గొప్పొళ్లున్నారు అంటున్న స‌మంత‌..!

సెక్స్ అడిక్ట్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్…

వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి…

నా చావు నేను చ‌స్తా అంటున్న రాజ‌మౌళి!

Click on Image to Read:

balakrishna priyadarshini ram

ntr statue

jc diwakar reddy

ys jagan

venkaiah naidu1

minister-son

comedian sudhakar

ysrcp

ysrcp flag

tamilnadu mp's

sujana chowdary ashok gajapati raju

anna rambabu, mla ashok reddy

chandrababu modi

jakkanna movie review

First Published:  2 Aug 2016 3:30 AM GMT
Next Story