Telugu Global
Cinema & Entertainment

బాలయ్య అభిమానులకు ఫృధ్వి క్షమాపణలు

తాజాగా విడుదలైన జక్కన్న సినిమా గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు. కానీ ఒక విషయంలో మాత్రం జక్కన్న సినిమా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీ చేసిన పాత్రపై బాలయ్య అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడంతో… జక్కన్న సినిమా మరోసారి నలుగురి దృష్టిని ఎట్రాక్ట్ చేసింది. బాలయ్యను కించపరిచేలా ఫృధ్వీ నటించాడని ఫ్యాన్స్ కోపంతో ఊగిపోయారు. ఈ పరిణామంతో కలత చెందిన పృథ్వీ తాజాగా.. బాలకృష్ణ అభిమానులకు.. పృథ్వీ […]

బాలయ్య అభిమానులకు ఫృధ్వి క్షమాపణలు
X

తాజాగా విడుదలైన జక్కన్న సినిమా గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు. కానీ ఒక విషయంలో మాత్రం జక్కన్న సినిమా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీ చేసిన పాత్రపై బాలయ్య అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడంతో… జక్కన్న సినిమా మరోసారి నలుగురి దృష్టిని ఎట్రాక్ట్ చేసింది. బాలయ్యను కించపరిచేలా ఫృధ్వీ నటించాడని ఫ్యాన్స్ కోపంతో ఊగిపోయారు. ఈ పరిణామంతో కలత చెందిన పృథ్వీ తాజాగా.. బాలకృష్ణ అభిమానులకు.. పృథ్వీ రాజ్ చేయు విన్నపం.. అంటూ తన అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు.

ఇంతకూ పృథ్వీ ఈ వీడియో ద్వారా ఏం చెప్పారంటే.. ముందుగా నమస్తే అంటూ, తెలుగు ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య బాబు అభిమానులందరికీ మీ పృథ్వీ రాజ్ నమస్కరించి.. నేను చేసిన ‘కటకటాల కట్టప్ప’ అనే క్యారెక్టర్ లో కొన్ని షేడ్స్ మా బాలయ్య గారిలా ఉన్నాయని, అందుకు మేమెంతో బాధపడుతున్నామని కొందరు అన్నారు.. నేను చాలా బాధపడ్డాను. ఫ్యాన్స్ కు బాలయ్య దేవుడైతే.. ఇక్కడ నాకూ ఆయన దేవుడే. బాలకృష్ణ గారు లెజెండ్, డిక్టేటర్.. ఆయన నాకు ఇన్స్పిరేషన్, ఆయన డైలాగ్స్ అన్నా, ఆ రౌద్ర రసమన్నా బాగా ఇష్టం. నాకు బాలయ్య దేవుడు, నేను ఓ భక్తుడిని.. దేవుడు మంచి మాటలను, ఆవేశాన్ని, మంచితనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే నా తపన.. అంతేకాని వేరే రకంగా కాదు.. ఇప్పుడు ఆయన అభిమానులు ఇలా నన్ను చేయొద్దని చక్కగా చెప్పారు. ఇంకెప్పుడూ నా నుంచి అటువంటి మాడ్యులేషన్ గాని, హీరో గారిని ఇమిటేట్ చేయడం గాని ఉండవని సవివరంగా తెలియజేస్తున్నాను అని పృథ్వీ రాజ్ చాలా బాధపడుతూ చెప్పుకొచ్చారు. చివరగా జై బాలయ్య, జైజై బాలయ్య అని పృథ్వీ ముగించారు.

First Published:  31 July 2016 9:46 PM GMT
Next Story