Telugu Global
International

"ఆప్త"కు హాజరుకానున్న అతిరథమహారథులు

సెప్టెంబర్ నాలుగు నుంచి రెండు రోజుల పాటు అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ”ఆప్త” ఉత్సవాలు జరగనున్నాయి. కాలిఫోర్నియా వేదికగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్, బీజేపీ నేత సోమువీర్రాజు, హైదరాబాద్‌ మేయర్ బొంతు రామ్మోహన్‌, నెంబర్‌ వన్‌ ఛానల్‌ చైర్మన్‌ సాయి […]

ఆప్తకు హాజరుకానున్న అతిరథమహారథులు
X

సెప్టెంబర్ నాలుగు నుంచి రెండు రోజుల పాటు అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ”ఆప్త” ఉత్సవాలు జరగనున్నాయి. కాలిఫోర్నియా వేదికగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్, బీజేపీ నేత సోమువీర్రాజు, హైదరాబాద్‌ మేయర్ బొంతు రామ్మోహన్‌, నెంబర్‌ వన్‌ ఛానల్‌ చైర్మన్‌ సాయి సుధాకర్‌, కూచిపూడి కళాకారిణి శోభానాయుడు తదితరులు ఈవెంట్‌కు హాజరవుతారు. దాసరిని లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో “ఆప్త” సత్కరించనుంది. “ఆప్త” ఈవెంట్‌కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా నార్త్ అమెరికాలోని తెలుగువారి కోసం “ఆప్త” అనేక కార్యక్రమాలు చేస్తోంది. “ఆప్త స్టూడెంట్ ఎడ్యూకేషన్ ప్రొగ్రామ్” ద్వారా చదువు కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులకు సాయసహకారాలు అందజేస్తోంది. ఆప్త ఈవెంట్ కు teluguglobal.com స్ఫాన్సర్ గా వ్యవహరిస్తోంది.

kapu

Next Story