Telugu Global
Cinema & Entertainment

శంషాబాద్ నుంచి గోల్కొండకు షిఫ్ట్

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇజమ్ అనే సినిమా చేస్తున్నాడు కల్యాణ్ రామ్. తను హీరోగా నటించడంతో పాటు… ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తనే నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా నిర్మాత కల్యాణ్ రామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో భాగంగా వచ్చే ఛేజింగ్ సన్నివేశాల్ని దాదాపు 10రోజులుగా తెరకెక్కిస్తున్నారంటే… సినిమా కోసం కల్యాణ్ రామ్ […]

శంషాబాద్ నుంచి గోల్కొండకు షిఫ్ట్
X

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇజమ్ అనే సినిమా చేస్తున్నాడు కల్యాణ్ రామ్. తను హీరోగా నటించడంతో పాటు… ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తనే నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా నిర్మాత కల్యాణ్ రామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో భాగంగా వచ్చే ఛేజింగ్ సన్నివేశాల్ని దాదాపు 10రోజులుగా తెరకెక్కిస్తున్నారంటే… సినిమా కోసం కల్యాణ్ రామ్ ఎంత ఖర్చుపెడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. రెండు రోజుల కిందట శంషాబాద్ లో ఈ ఛేజింగ్ సన్నివేశాలు తెరకెక్కించారు. ప్రస్తుతం గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఈ దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాతో అదితీ పూరీ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన కల్యాణ్ రామ్ మేకోవర్ గెటప్, టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు… త్వరలోనే మరో స్పెషల్ ఎట్రాక్షన్ కూడా రాబోతోంది. అవును.. ఈ సినిమా కోసం కల్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ ట్రైచేస్తున్నాడు. ఆ సిక్స్ ప్యాక్ బాడీ లుక్ ను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు. పూరి సినిమా కోసం కల్యాణ్ రామ్ ఎంత కష్టపడుతున్నాడో దీన్నిబట్టి అర్థం అవుతోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు.

First Published:  31 July 2016 1:23 AM GMT
Next Story