Telugu Global
Cinema & Entertainment

హన్సిక పాత ప్రేమాయణం ఇక లేదంటోంది

హన్సిక, తమిళ హీరో శింబు మధ్య లవ్ అఫెయిర్ గురించి అప్పట్లో ఒక రేంజ్‌లో పుకార్లు షికార్లు చేశాయి. కాని హన్సిక ఆ అఫెయిర్ నుండి తనంతట తాను బయటికి వచ్చేసిందనే చెప్పాలి. ఆ తర్వాత పూర్తిగా కెరీర్ పైననే దృష్టి పెట్టింది. ఇటీవల మళ్ళీ హన్సిక తన మాజీ ప్రియుడు శింబుతో ఒక తమిళ సినిమాలో నటించబోతోందనే కథనాలు వెలువడ్డాయి. శింబు డ్యూయల్ రోల్  చేస్తున్న ఈ సినిమాలో ఒక నాయికగా శ్రియ, మరో నాయికగా హన్సిక […]

హన్సిక పాత ప్రేమాయణం ఇక లేదంటోంది
X

హన్సిక, తమిళ హీరో శింబు మధ్య లవ్ అఫెయిర్ గురించి అప్పట్లో ఒక రేంజ్‌లో పుకార్లు షికార్లు చేశాయి. కాని హన్సిక ఆ అఫెయిర్ నుండి తనంతట తాను బయటికి వచ్చేసిందనే చెప్పాలి. ఆ తర్వాత పూర్తిగా కెరీర్ పైననే దృష్టి పెట్టింది. ఇటీవల మళ్ళీ హన్సిక తన మాజీ ప్రియుడు శింబుతో ఒక తమిళ సినిమాలో నటించబోతోందనే కథనాలు వెలువడ్డాయి. శింబు డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో ఒక నాయికగా శ్రియ, మరో నాయికగా హన్సిక అతడితో రొమాన్స్ చేయబోతోందనే రూమర్స్ షికారు చేశాయి. అయితే హన్సిక వెంటనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ‘అదంతా ఫేక్ ‘ అంటూ క్లారిటీ ఇచ్చేసింది. సో.. ఇక శింబుతో హన్సిక సినిమా అనేది లేదన్నమాటే.

First Published:  29 July 2016 11:10 AM GMT
Next Story