Telugu Global
NEWS

ద‌స‌రా త‌రువాత తెలంగాణ‌ స‌చివాల‌యం కూల్చివేత‌

తెలంగాణ‌లో కొత్త స‌చివాల‌యానికి ద‌స‌రా త‌రువాత శంకుస్థాప‌న చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌స్తుత‌మున్న సెక్ర‌టేరియెట్ భ‌వ‌నానికి వాస్తు దోషాలు, ఇత‌ర లోపాలు ఉన్న దృష్ట్యా ఇప్పుడున్న స‌చివాల‌యాన్ని కూల్చి అదే స్థానంలో కొత్త స‌చివాలయాన్ని నిర్మించాల‌ని ప్ర‌భుత్వం యోచించిన సంగ‌తి తెలిసిందే! తొలుత ఎర్ర‌గడ్డ ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో కొత్త సెక్ర‌టేరియ‌ట్‌ని నిర్మించాల‌ని ప్ర‌భుత్వం భావించింది. కానీ, తిరిగి పాత ప్రాంగ‌ణానికే మొగ్గు చూపింది. ఇప్పుడు ఏపీ ఉద్యోగులు కూడా అమ‌రావ‌తికి త‌ర‌లిపోవ‌డంతో.. ఇంత‌కాలం వాయిదా ప‌డిన ఈ […]

ద‌స‌రా త‌రువాత తెలంగాణ‌ స‌చివాల‌యం కూల్చివేత‌
X

తెలంగాణ‌లో కొత్త స‌చివాల‌యానికి ద‌స‌రా త‌రువాత శంకుస్థాప‌న చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌స్తుత‌మున్న సెక్ర‌టేరియెట్ భ‌వ‌నానికి వాస్తు దోషాలు, ఇత‌ర లోపాలు ఉన్న దృష్ట్యా ఇప్పుడున్న స‌చివాల‌యాన్ని కూల్చి అదే స్థానంలో కొత్త స‌చివాలయాన్ని నిర్మించాల‌ని ప్ర‌భుత్వం యోచించిన సంగ‌తి తెలిసిందే! తొలుత ఎర్ర‌గడ్డ ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో కొత్త సెక్ర‌టేరియ‌ట్‌ని నిర్మించాల‌ని ప్ర‌భుత్వం భావించింది. కానీ, తిరిగి పాత ప్రాంగ‌ణానికే మొగ్గు చూపింది. ఇప్పుడు ఏపీ ఉద్యోగులు కూడా అమ‌రావ‌తికి త‌ర‌లిపోవ‌డంతో.. ఇంత‌కాలం వాయిదా ప‌డిన ఈ ప‌నులు ఇక ఊపందుకోనున్నాయి. ద‌స‌రా వ‌ర‌కు ఎలాంటి ముహూర్తాలు లేక‌పోవ‌డంతో క్షేత్ర‌స్థాయి ప‌నులు ప్రారంభం కాలేదు. ద‌సరాకు శంకుస్థాప‌న ప‌నులు పూర్తికాగానే ఇప్పుడున్న బ్లాకుల కూల్చివేత మొద‌లవుతుంది. కానీ, ఈ ప‌నుల‌కు సంబంధించిన పేప‌ర్ వ‌ర్క్‌, ప్రణాళిక‌ల ప‌నులు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం ఇప్ప‌టికే స‌ర్కారు రూ.200 కోట్లు విడుద‌ల చేసింది కూడా. ప్ర‌స్తుతం ఉన్న స‌మాచారం ప్ర‌కారం.. కొత్త స‌చివాల‌యం యూ ఆకారంలో ఉండ‌నుంది. దీనికి సంబంధించిన డిజైన్‌ను ప్ర‌ముఖ ఆర్కిటెక్చ‌ర్ హ‌ఫీజ్ కాంట్రాక్ట‌ర్ రూపొందించి సీఎంకు అందించిన విష‌యం తెలిసిందే!

స‌చివాల‌యం ముందు ఉన్న ఖాళీ స్థ‌లంలో క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ నిర్మించ‌నున్నారు. ఇక‌పోతే కొత్త సచివాలయం తయారయ్యేదాకా ప్ర‌స్తుత మంత్రుల పేషీల‌ను బూర్గుల రామ‌క్రిష్ణారావు, గృహ‌క‌ల్ప‌, మైత్రివ‌నం భ‌వ‌నాల‌ను ఇందుకోసం ప‌రిశీలిస్తున్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా కొత్త స‌చివాల‌యం ప‌నులు పూర్తి చేసి.. ప్రారంభోత్స‌వం చేయాల‌ని ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకుంది. మొత్తం ఐదు అంత‌స్తుల భ‌వ‌నంలో అన్ని బ్లాకులు విశాలంగా నిర్మించ‌నున్నారు. పార్కింగ్‌, ప‌చ్చ‌ద‌నానికి పెద్ద‌పీట వేయ‌నున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పోల్చిచూసుకుని తెలంగాణ సర్కారును తెలుగు రాష్ట్రాల ప్రజలు మెచ్చుకుంటున్నారు. అయితే సెక్రటేరియెట్‌ కూల్చి కొత్త సెక్రటేరియెట్‌ నిర్మించాలనుకోవడం పిచ్చిపనిగానూ, కేసీఆర్‌ నియంతృత్వధోరణికి పరాకాష్ట్రగానూ భావిస్తున్నారు. కేసీఆర్‌ సెంటిమెంట్‌కోసం కొన్ని వందల కోట్ల ప్రజా ధనాన్నిదుర్వినియోగం చేయడం ఏమిటని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితులలో, విద్యా, వైద్య సంస్థలకు కనీస సదుపాయాలు కల్పించడానికి డబ్బుల్లేని పరిస్థితుల్లో ఉన్న మంచి సెక్రటేరియెట్‌ను కూల్చి కొత్తది నిర్మించడానికి వందలకోట్లు వృధాచేయడం దుర్మార్గమని ప్రజాస్వామ్యవాదులు నిరసన వ్యక్తంచేస్తున్నారు.

First Published:  27 July 2016 11:37 PM GMT
Next Story