Telugu Global
Cinema & Entertainment

శంషాబాద్ లో కల్యాణ్ రామ్ హంగామా

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇజమ్ అనే సినిమా చేస్తున్నాడు హీరో కల్యాణ్ రామ్. తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై తనే నిర్మాతగా, హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కోసం పూరి చెప్పినట్టు మేకోవర్ కూడా అయ్యాడు. హీరోయిన్ గా అదితి ఆర్యా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో జరుగుతోంది. మరో 2 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే […]

శంషాబాద్ లో కల్యాణ్ రామ్ హంగామా
X
ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇజమ్ అనే సినిమా చేస్తున్నాడు హీరో కల్యాణ్ రామ్. తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై తనే నిర్మాతగా, హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కోసం పూరి చెప్పినట్టు మేకోవర్ కూడా అయ్యాడు. హీరోయిన్ గా అదితి ఆర్యా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో జరుగుతోంది. మరో 2 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు ఓ ఛేజింగ్ సీన్ కూడా పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ అయిన వెంటనే ఆగస్ట్ లో విదేశాలకు వెళ్లనుంది ఇజమ్ టీం. అక్కడ మరికొన్ని సన్నివేశాలతో పాటు పాటలు చిత్రీకరిస్తారు. సినిమాలో కల్యాణ్ రామ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు. పూరీ సినిమాల్లో హీరో ఎంత ఎగ్రెసివ్ గా, టెంపర్ గా కనిపిస్తాడో మనందరికీ తెలిసిందే. ఇప్పటివరకు మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, గోపీచంద్, ప్రభాస్ లాంటి ఎఁతో మంది హీరోల్ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేసిన పూరి జగన్నాధ్… ఇప్పుడు కల్యాణ్ రామ్ కు మరో డిఫరెంట్ ఇమేజ్ ఇచ్చేందురు రెడీ అవుతున్నాడు. సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
First Published:  28 July 2016 6:32 AM GMT
Next Story