అనసూయలో లేనిది... రష్మి లో ఉన్నది అదే..?
కెరీర్ లో బ్రేక్ అప్ పాయింట్ అనేది మిగిలిన రంగాల్లో ఏమోగానీ గ్లామర్ ఫీల్డ్ లో మాత్రం ఎప్పుడు వస్తుందో చెప్పలేం… అంతే వేగంగా ఒక పీక్ పాయింట్ నుంచి పడిపోవటమూ మామూలే. రష్మి గౌతమ్ సినిమాల్లో గట్టిగానే ట్రై చేసి అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరకి షిఫ్ట్ అయి నటిగా కాక “జబర్దస్త్ యాంకర్” గానే గుర్తింపు తెచ్చుకుంది. అసలంతకుముందు సినిమాల్లో చేసానని ఆమె చెప్తే తప్ప ఎవరికీ తెలియనంత ఫేం యాంకర్ గానే తెచ్చేసుకుంది .. సినిమా […]
BY sarvi28 July 2016 10:09 AM GMT
X
sarvi Updated On: 28 July 2016 10:30 AM GMT
కెరీర్ లో బ్రేక్ అప్ పాయింట్ అనేది మిగిలిన రంగాల్లో ఏమోగానీ గ్లామర్ ఫీల్డ్ లో మాత్రం ఎప్పుడు వస్తుందో చెప్పలేం… అంతే వేగంగా ఒక పీక్ పాయింట్ నుంచి పడిపోవటమూ మామూలే. రష్మి గౌతమ్ సినిమాల్లో గట్టిగానే ట్రై చేసి అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరకి షిఫ్ట్ అయి నటిగా కాక “జబర్దస్త్ యాంకర్” గానే గుర్తింపు తెచ్చుకుంది. అసలంతకుముందు సినిమాల్లో చేసానని ఆమె చెప్తే తప్ప ఎవరికీ తెలియనంత ఫేం యాంకర్ గానే తెచ్చేసుకుంది .. సినిమా తార ఎక్స్ పోజింగ్ వేరూ, యాంకరమ్మ వచ్చి అందాలు ఆరబోయటం వేరు. జనం నోళ్ళు వెళ్ళబెట్టాలంటే ఏం చేయాలో కొందరు చిన్న నిర్మాతలకు అర్థమైపోయింది. నటనలో రష్మీ మంచి పెర్ఫార్మరే అయినా ‘గుంటూర్ టాకీస్’ సినిమాకి రష్మి అందాలు ఎంతగా హెల్ప్ అయ్యాయనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే రష్మితో సినిమాలు తీయడానికి చిన్న నిర్మాతలు పోటీ పడుతున్నారు. అంతం సినిమా ఫ్లాప్ అయినా కానీ రష్మి డిమాండ్ ఏమీ తగ్గలేదు. అసలు రష్మి కెరీర్ లో ఇప్పుడున్న ప్లస్ పాయిట్లేమిటీ..??
ఇలాంటి సినిమానే చేస్తా, ఇంత నిడివి ఉంటేనే సంతకం చేస్తా, ఇలాంటి బట్టలే వేసుకుంటానంటూ రష్మి కండిషన్లు ఏమీ పెట్టడం లేదు. తనకి కావాల్సిన పారితోషికం ఎంతో చెప్పి అదిస్తానన్న వారికి డేట్స్ ఇచ్చేస్తోంది.ఎటూ తాను మరీ అగ్రహీరోయిన్ రేంజ్ కి వెళ్ళను అన్న విషయం ఆమెకీ తెలుసు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకుంటోంది. తనకూ కావాల్సిందేంటో నిర్మొహమాటంగా అడుగుతూనే, సినిమాకి తననుంచి ఏం కావాలో అంతే నిర్మొహమాటంగా ఇచ్చెస్తోంది. ఇదే యాంకర్ రష్మి గౌతమ్ లో ఉన్నది… అనసూయ లో లేనిది అంటున్నారు పరిశీలకులు. అనసూయ రెమ్యునరేషన్ విషయంలో మరీ ఎక్కువగా డిమాండ్ చేస్తుండటంతో… రష్మీ గౌతమ్ నే చిన్న నిర్మాతలు అప్రొచ్ అవుతున్నారు మరి.
Click on Image to Read:
Next Story