Telugu Global
Cinema & Entertainment

హమ్మయ్య... మొత్తానికి మొదలుపెట్టాడు...

అప్పుడెప్పుడో చాన్నాళ్ల కిందట అఖిల్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అది కాస్తా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ ముఖానికి రంగేసుకోలేదు. తిరిగి తెరపై కనిపించలేదు. ఎప్పుడు మళ్లీ రెండో సినిమా చేస్తాడా అని అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆశగా ఎదురుచూశారు. శ్రీనువైట్ల నుంచి వంశీ పైడిపల్లి వరకు ఎంతోమంది పేర్లను పరిశీలించిన తర్వాత… ఫైనల్ గా హను రాఘవపూడి అనే దర్శకుడికి ఓటేశాడు అఖిల్. అందాలరాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ లాంటి సినిమాలు […]

హమ్మయ్య... మొత్తానికి మొదలుపెట్టాడు...
X

అప్పుడెప్పుడో చాన్నాళ్ల కిందట అఖిల్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అది కాస్తా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ ముఖానికి రంగేసుకోలేదు. తిరిగి తెరపై కనిపించలేదు. ఎప్పుడు మళ్లీ రెండో సినిమా చేస్తాడా అని అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆశగా ఎదురుచూశారు. శ్రీనువైట్ల నుంచి వంశీ పైడిపల్లి వరకు ఎంతోమంది పేర్లను పరిశీలించిన తర్వాత… ఫైనల్ గా హను రాఘవపూడి అనే దర్శకుడికి ఓటేశాడు అఖిల్. అందాలరాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ లాంటి సినిమాలు తెరకెక్కించిన హను దర్శకత్వంలో రెండో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. ఈ ప్రాజెక్టుకు ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే సెట్స్ పైకి వస్తుందని కూడా అఖిల్ తెలిపాడు. అధికారికంగా ఇది ఎప్పుడుసెట్స్ పైకి వస్తుంది అనే విషయాన్ని మాత్రం అఖిల్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే టోటల్ స్క్రీన్ ప్లే మొత్తం కంప్లీట్ అయిందని, తనకు స్టోరీ బాగా నచ్చిందనే విషయాన్ని మాత్రం పక్కా చేశాడు. త్వరలోనే అఖిల్-హను ప్రాజెక్టు డీటెయిల్స్ బయటకురాబోతున్నాయి.

First Published:  27 July 2016 9:22 PM GMT
Next Story