Telugu Global
Cinema & Entertainment

ప్రతిష్టాత్మక సినిమా వచ్చేది అప్పుడే...

నందమూరి నటసింహం బాలకృష్ణ  ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలకు సంబంధించి డేట్ ఫిక్స్ చేశారు. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మొన్నటి వరకూ జార్జియాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఇటీవలే దర్శకుడు క్రిష్ కు పెళ్లి ఖాయం అవ్వడంతో షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చారు. షూటింగ్ లేకపోయినా మరోవైపు గ్రాఫిక్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ లోగా సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ముందునుంచి […]

ప్రతిష్టాత్మక సినిమా వచ్చేది అప్పుడే...
X

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలకు సంబంధించి డేట్ ఫిక్స్ చేశారు. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మొన్నటి వరకూ జార్జియాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఇటీవలే దర్శకుడు క్రిష్ కు పెళ్లి ఖాయం అవ్వడంతో షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చారు. షూటింగ్ లేకపోయినా మరోవైపు గ్రాఫిక్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ లోగా సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ముందునుంచి అనుకుంటున్నట్టు 2017 సంక్రాంతి కానుకగానే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను రిలీజ్ చెయ్యాలని నిర్ణయించారు. డేట్ చెప్పనప్పటికీ… తాజా సమాచారం ప్రకారం… జనవరి 12న సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. 99వ చిత్రం అనంతరం ఎన్నో చర్చలు, ఎంతోమంది దర్శకుల పేర్లు అనుకున్న తర్వాత… ఫైనల్ గా క్రిష్ కు ఓకే చెప్పాడు బాలయ్య. చరిత్రను, శాతకర్ణి వీరత్వాన్ని ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ చిత్రం తీస్తున్నానని క్రిష్ కూడా పలు సందర్భాల్లో చెప్పాడు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

First Published:  27 July 2016 3:57 AM GMT
Next Story