Telugu Global
National

బెజవాడ విల్సన్‌కు రామన్‌ మెగసెసె అవార్డు

ఈ ఏడాది రామన్‌ మెగసెసె అవార్డు “సఫాయి కర్మచారి ఆందోళన్‌” నేషనల్‌ కన్వీనర్‌ బెజవాడ విలస్సన్‌కు, మద్రాసుకు చెందిన కర్ణాటక సంగీతకారుడు టి.ఎం. కృష్ణకు ఇచ్చినట్లు ప్రకటించారు. ఫిలిపైన్స్‌ మాజీ ప్రెసిడెంట్‌ రామన్‌ మెగసెసె జ్ఞాపకార్ధం ప్రతి ఏడాది ఆసియా ప్రజలకు నిస్వార్ధసేవలందించిన వ్యక్తులకు ఈ రామన్‌ మెగసెసె అవార్డును అందజేస్తారు. ఈ ఏడాది సంగీతజ్ఞుడు కృష్ణతోపాటు విల్సన్‌కు సామాజిక సేవా రంగంలో ఈ అవార్డును అందజేశారు. కర్ణాటకలో ఓ దళిత కుటుంబంలో పుట్టిన విల్సన్‌ దళిత […]

బెజవాడ విల్సన్‌కు రామన్‌ మెగసెసె అవార్డు
X

ఈ ఏడాది రామన్‌ మెగసెసె అవార్డు “సఫాయి కర్మచారి ఆందోళన్‌” నేషనల్‌ కన్వీనర్‌ బెజవాడ విలస్సన్‌కు, మద్రాసుకు చెందిన కర్ణాటక సంగీతకారుడు టి.ఎం. కృష్ణకు ఇచ్చినట్లు ప్రకటించారు.

ఫిలిపైన్స్‌ మాజీ ప్రెసిడెంట్‌ రామన్‌ మెగసెసె జ్ఞాపకార్ధం ప్రతి ఏడాది ఆసియా ప్రజలకు నిస్వార్ధసేవలందించిన వ్యక్తులకు ఈ రామన్‌ మెగసెసె అవార్డును అందజేస్తారు.

ఈ ఏడాది సంగీతజ్ఞుడు కృష్ణతోపాటు విల్సన్‌కు సామాజిక సేవా రంగంలో ఈ అవార్డును అందజేశారు.

కర్ణాటకలో ఓ దళిత కుటుంబంలో పుట్టిన విల్సన్‌ దళిత కార్మికులు చేతులతో మల మూత్రాలను ఎత్తివేయడం చూసి అలాంటి దురాచారాన్ని అరికట్టే ఉద్యమంలో భాగంగా కొందరితోకలిసి “సఫాయి కర్మచారి ఆందోళన్‌”సంస్థను ప్రారంభించారు. పుట్టింది కర్ణాటకలో అయినా ఆంధ్రప్రదేశ్‌తో ఆయనకు అనుబంధం ఎక్కువ. ఆయన చదువుకూడా ఆంధ్రప్రదేశ్ లోనే సాగింది. ఆయన పూర్వికులు ఆంధ్రప్రదేశ్‌నుంచి వెళ్లి కర్ణాటకలో స్థిరపడ్డారు.

“సఫాయి కర్మచారి ఆందోళన్‌”సంస్థకు మాజీ ఐఏఎస్‌ అధికారి శంకరన్‌ కొండంత అండగా నిలిచారు. ఆయన సలహా సూచనలమేరకు విల్సన్‌ ఈ సంస్థను దేశవ్యాప్తంగా ఐదువందల జిల్లాల్లో విస్తరించి ఏడువేలమంది సభ్యులను చేర్పించారు. ఈ సంస్థ నిర్వహించిన అనేక ఆందోళనాకార్యక్రమాలవల్ల ఆరులక్షల సంఖ్యలో వున్న సఫాయి కార్మికులు ఇప్పుడు మూడు లక్షలకు తగ్గారు. ఈ వృత్తినుంచి బయటపడ్డ కార్మికులకు ఉపాధి కల్పించడంలో ఈ సంస్థ గణనీయంగా కృషిచేసింది.

మనుషులు ఆత్మగౌరవంతో బ్రతకలేని వృత్తులనుంచి బయటకు రావాలని, వచ్చిన వాళ్లకు సరైన ఉపాధి కల్పించాలని బెజవాడ విల్సన్‌ చాలా పోరాడారు. ఆయన కృషికి గుర్తింపుగా 2016వ సంవత్సరపు “రామన్‌ మెగసెసె అవార్డు” విల్సన్‌కు లభించడం దళితుల ఆత్మగౌరవపోరాటానికి ఒక గుర్తింపు.

First Published:  27 July 2016 1:29 AM GMT
Next Story