Telugu Global
NEWS

ఏపీలో రూ. 33 లక్షల కోట్ల నిక్షేపాలు గుర్తింపు

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ గ్యాస్‌ నిక్షేపం బయటపడింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన సంపదగా గుర్తించారు.ఇప్పటి వరకు ప్రపంచంలో ఇంత భారీ నిక్షేపాన్ని గుర్తించలేదు. బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరంలోని కేజీ బేసిన్ పరిధిలో ఈ గ్యాస్ హైడ్రేట్స్‌ను కనుగొన్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ సారథ్యంలోని ఈ అన్వేషణలో పాల్గొన్న అమెరికా జియోలాజికల్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. వీటిలో 134 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ నిక్షిప్తమై ఉన్నట్లు ప్రాధమిక అంచనా. ప్రస్తుత ధరల ప్రకారం […]

ఏపీలో రూ. 33 లక్షల కోట్ల నిక్షేపాలు గుర్తింపు
X

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ గ్యాస్‌ నిక్షేపం బయటపడింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన సంపదగా గుర్తించారు.ఇప్పటి వరకు ప్రపంచంలో ఇంత భారీ నిక్షేపాన్ని గుర్తించలేదు. బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరంలోని కేజీ బేసిన్ పరిధిలో ఈ గ్యాస్ హైడ్రేట్స్‌ను కనుగొన్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ సారథ్యంలోని ఈ అన్వేషణలో పాల్గొన్న అమెరికా జియోలాజికల్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. వీటిలో 134 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ నిక్షిప్తమై ఉన్నట్లు ప్రాధమిక అంచనా. ప్రస్తుత ధరల ప్రకారం ఈ నిక్షేపం విలువ రూ. 33 లక్షల కోట్లుగా చెబుతున్నారు. కృష్ణా-గోదావరి బేసిన్‌లోని 982, డి3, డి6, డి9 బ్లాకుల్లో ఈ గ్యాస్ హైడ్రేట్స్ నిక్షేపాలను గుర్తించినట్లు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ వర్గాలు తెలిపాయి. ఇవి రిలయన్స్ గ్యాస్ క్షేత్రమైన కేజీ-డి6 బ్లాక్‌కు 30 కిలోమీటర్లు నైరుతిగా ఉన్నాయి. కేజీ బేసిన్‌లో రిలయన్స్ గ్యాస్ ఇండస్ట్రీస్ 2002లో కనుగొన్న అతి భారీ గ్యాస్ క్షేత్రంలో ఉన్నట్లు పేర్కొన్న గ్యాస్ కన్నా.. తాజాగా ఇదే కేజీ బేసిన్‌లో కనుగొన్న గ్యాస్ హైడ్రేట్లు పది రెట్లు అధికం. అయితే దీన్ని వెలికితీయడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

First Published:  26 July 2016 10:29 PM GMT
Next Story