Telugu Global
Cinema & Entertainment

ఈసారి పుట్టినరోజుకు ఏం వస్తుందో..?

తన ప్రతి పుట్టినరోజుకు మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం సినిమాలకు సంబంధించి ఏదో ఒకటి విడుదల చేశాడు. అది టీజర్ కావొచ్చు. ఎట్ లీస్ట్ పోస్టర్ అయినా కావొచ్చు. కానీ ఈసారి మాత్రం మహేష్ డైలమాలో పడిపోయాడు. ఎందుకంటే… ఈ పుట్టినరోజుకు విడుదల చేయడానికి మహేష్ వద్ద ఏమీ లేదు. సింపుల్ గా చెప్పాలంటే… ఈ పుట్టినరోజుకు రిలీజ్ చేయడానికి మహేష్ వద్ద రెడీగా ఏ సినిమా లేదు. మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు మహేష్ […]

ఈసారి పుట్టినరోజుకు ఏం వస్తుందో..?
X

తన ప్రతి పుట్టినరోజుకు మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం సినిమాలకు సంబంధించి ఏదో ఒకటి విడుదల చేశాడు. అది టీజర్ కావొచ్చు. ఎట్ లీస్ట్ పోస్టర్ అయినా కావొచ్చు. కానీ ఈసారి మాత్రం మహేష్ డైలమాలో పడిపోయాడు. ఎందుకంటే… ఈ పుట్టినరోజుకు విడుదల చేయడానికి మహేష్ వద్ద ఏమీ లేదు. సింపుల్ గా చెప్పాలంటే… ఈ పుట్టినరోజుకు రిలీజ్ చేయడానికి మహేష్ వద్ద రెడీగా ఏ సినిమా లేదు.

మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు మహేష్ ఒప్పుకున్నాడు. ఆ మూవీ ఈనెల 29న ప్రారంభం అవుతుంది. ఆగస్ట్ 1 నుంచి మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొంటాడు. ఆగస్ట్ 1 నుంచి మహేష్ బాబు-రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఓ సాంగ్ ను పిక్చరైజ్ చేయడానికి మురుగ సన్నాహాలు చేస్తున్నాడు. ఆ వెంటనే ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు ఉంది. సో… ఆ వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ చేయడానికి ఏమీ ఉండదు. అలా అని రకుల్ తో దిగిన ఫొటోల్ని బర్త్ డే కు విడుదల చేయలేడు. సో… ఈసారి మహేష్ బాబు బర్త్ డే కు ఏమీ ఆశించకపోవడమే కరెక్ట్ అంటున్నారు చాలామంది. అయితే తాజా సమాచారం ప్రకారం… సినిమా ప్రారంభం రోజున టైటిల్ ను ఎనౌన్స్ చేయకుండా… సినిమా పేరును మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మహేష్ ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇవ్వాలంటే ఇదొక్కటే దారి.

First Published:  26 July 2016 4:34 AM GMT
Next Story