Telugu Global
NEWS

నా భర్తపై నమ్మకం చచ్చిపోయింది, విడాకులకు ఒప్పుకోవడం లేదు

గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న సునీత ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితంలో పడుతున్న ఇబ్బందులను వివరించారు. తన భర్త వల్ల తాను చాలా ఇబ్బందులు పడుతున్నట్టు వెల్లడించారు. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు మందులు కూడా వాడినట్టు చెప్పారు. భర్త వల్ల తాను పడ్డ అవమానం, కార్చిన కన్నీటి గురించి తనకు మాత్రమే తెలుసన్నారు. కనీసం పిల్లల విషయంలోనూ బాధ్యత తీసుకునేవాడు కాదని చెప్పారు. అతడి ప్రభావం పిల్లలపై పడకూడదనే … […]

నా భర్తపై నమ్మకం చచ్చిపోయింది, విడాకులకు ఒప్పుకోవడం లేదు
X

గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న సునీత ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితంలో పడుతున్న ఇబ్బందులను వివరించారు. తన భర్త వల్ల తాను చాలా ఇబ్బందులు పడుతున్నట్టు వెల్లడించారు. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు మందులు కూడా వాడినట్టు చెప్పారు. భర్త వల్ల తాను పడ్డ అవమానం, కార్చిన కన్నీటి గురించి తనకు మాత్రమే తెలుసన్నారు. కనీసం పిల్లల విషయంలోనూ బాధ్యత తీసుకునేవాడు కాదని చెప్పారు.

అతడి ప్రభావం పిల్లలపై పడకూడదనే … దూరంగా ఉంచి తన కుమారుడిని చదివిస్తున్నట్టు చెప్పారు. తన కొడుకు ఎక్కడ చదువుకుంటున్నది భర్తకు తెలియదని వెల్లడించారు. ఇప్పటికైనా పిల్లల గురించి పట్టించుకోవచ్చు కదా అని ఇటీవల ఆయనతో మాట్లాడగా.. ‘ఆ విషయం నా కంటే నీకే బాగా తెలుసు’ అని తప్పించుకున్నారని వాపోయారామె. తాను విడాకులు తీసుకోలేదన్నారు సునీత. విడాకులకు తన భర్త సిద్దంగా లేరని చెప్పారు. గాయనిగా ఎదుగుతున్న సమయంలో తన పేరు చెప్పి చాలా మంది వద్ద తన భర్త డబ్బులు తీసుకున్నారని సునీత అన్నారు. సునీత 20ఏళ్లలోనే వివాహం చేసుకున్నారు. గత పదేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్నారు. దేవీశ్రీ ప్రసాద్, తమన్ లాంటి సంగీత దర్శకుల హవా నడుస్తోందని… వారంతా కొత్త గాయకుల వైపు మొగ్గు చూపుతున్నారని సునీత చెప్పారు. మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ పెట్టి, ఆన్‌లైన్ క్లాసులు చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు.

Click on Image to Read:

suresh-babu

nagarjuna-Kotha-Kotha-Bhash

ram-charan

tirupati-asp-sidda-reddy

mahanandi-reddy--murder-pla

jagan-praveen-kumar-reddy

chandrababi-toiltes

ongole-ysrcp-Mayo-shamantha

peddi-reddy-dwarakanath

ttdp

lokesh-1

ysrcp

jagan-mohanreddy-kasa-pil

paritala1

ysr-jalayagnam

ganta

raghuveera-reddy

ktr-birthday

chandrababu-naidu

chandrababu-anantapur-amara

First Published:  25 July 2016 4:18 AM GMT
Next Story