Telugu Global
Health & Life Style

టీవీ శ‌బ్దాల హోరు...జ్ఞాప‌క‌శ‌క్తి బేజారు!

చూసినా, చూడ‌క‌పోయినా చాలా ఇళ్ల‌లో టీవి అలా మోగుతూనే ఉంటుంది. పెద్ద‌వాళ్ల‌తో పాటు పిల్ల‌లు కూడా వాళ్లకి అర్ధ‌మైనా కాక‌పోయినా టీవీ చూస్తుంటారు. ఇక పిల్ల‌ల కోస‌మే కొన్ని ఛాన‌ళ్లున్నాయి. కొన్ని ఇళ్ల‌లో పిల్ల‌లు అల్ల‌రి చేయ‌కుండా ఉంటారు క‌దా…అని ఆ ఛాన‌ళ్ల‌ని పెట్టి పిల్ల‌ల‌ను వాటి ముందు కూర్చోబెడుతుంటారు. ఈ కార‌ణాల వ‌ల‌న పిల్ల‌ల మెద‌ళ్ల‌లోకి కొన్ని వంద‌ల ర‌కాల శ‌బ్దాలు చేరుతుంటాయి. ఇలా చిన్న‌త‌నంలో లెక్క‌కు మించిన భిన్న శ‌బ్దాల హోరు వారి చెవుల్లో […]

టీవీ శ‌బ్దాల హోరు...జ్ఞాప‌క‌శ‌క్తి బేజారు!
X

చూసినా, చూడ‌క‌పోయినా చాలా ఇళ్ల‌లో టీవి అలా మోగుతూనే ఉంటుంది. పెద్ద‌వాళ్ల‌తో పాటు పిల్ల‌లు కూడా వాళ్లకి అర్ధ‌మైనా కాక‌పోయినా టీవీ చూస్తుంటారు. ఇక పిల్ల‌ల కోస‌మే కొన్ని ఛాన‌ళ్లున్నాయి. కొన్ని ఇళ్ల‌లో పిల్ల‌లు అల్ల‌రి చేయ‌కుండా ఉంటారు క‌దా…అని ఆ ఛాన‌ళ్ల‌ని పెట్టి పిల్ల‌ల‌ను వాటి ముందు కూర్చోబెడుతుంటారు. ఈ కార‌ణాల వ‌ల‌న పిల్ల‌ల మెద‌ళ్ల‌లోకి కొన్ని వంద‌ల ర‌కాల శ‌బ్దాలు చేరుతుంటాయి. ఇలా చిన్న‌త‌నంలో లెక్క‌కు మించిన భిన్న శ‌బ్దాల హోరు వారి చెవుల్లో ప‌డుతుంటే పిల్ల‌ల్లో జ్ఞాప‌క శ‌క్తి, త‌ద్వారా నేర్చుకునే శ‌క్తి త‌గ్గిపోతాయంటున్నారు ప‌రిశోధ‌కులు. ముఖ్యంగా ఎక్కువ స‌మయం టీవీ ముందు కూర్చునే పిల్ల‌ల్లో కొత్త ప‌దాల‌ను నేర్చుకునే శ‌క్తి త‌గ్గిపోతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. ఈ పిల్ల‌లు కొత్త‌ప‌దాల‌ను గుర్తుపెట్టుకుని తిరిగి ప‌ల‌క‌లేక‌పోతున్నార‌ని, వాటిని జ్ఞాప‌కం ఉంచుకోలేకపోతున్నార‌ని అమెరికాలోని విస్కాన్సిన్ యూనివ‌ర్శిటీ శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. టీవీని ఎక్కువ‌గా చూస్తున్న పిల్ల‌ల‌కంటే ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో పెరుగుతున్న పిల్ల‌ల్లో జ్ఞాప‌క‌శ‌క్తి, కొత్త‌ప‌దాల‌ను గుర్తుంచుకునే శ‌క్తి ఎక్కువ‌గా ఉన్న‌ట్టు గ‌మ‌నించారు. పిల్ల‌లు నేర్చుకుని, గుర్తుంచుకున్న ప‌దాల శ‌బ్దాల‌పై, అన‌వ‌స‌ర శ‌బ్దాల హోరు ప్ర‌భావం చూప‌టం వ‌ల‌న వారు జ్ఞాప‌క‌శక్తిని కోల్పోయి, నేర్చుకున్న ప‌దాల‌ను మ‌ర్చిపోతున్నార‌ని వారు చెబుతున్నారు.

First Published:  21 July 2016 7:02 PM GMT
Next Story