Telugu Global
Cinema & Entertainment

కళ్లుచెదిరే రేటుకు బాహుబలి ఓవర్సీస్ రైట్స్...

బాహుబలి-2 సినిమా ప్రకంపనలు మెల్లమెల్లగా ప్రారంభమయ్యాయి. సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుపుతున్నారు. వివిధ ప్రాంతాల్లో హక్కులకు సంబంధించి ఇప్పటికే నిర్మాతలు ఓ అవగాహనకు వచ్చారు. నైజాం, ఏపీ లాంటి హక్కుల్ని పక్కనపెడితే… మిగతా రాష్ట్రాలు, ఓవర్సీస్ కు సంబంధించి బిజినెస్ ను ముందుగానే క్లోజ్ చేయాలని నిర్మాతలు చూస్తున్నారు. ఇందులో భాగంగా… బాహుబలి-2 ఓవర్సీస్ హక్కుల్ని ఏకంగా 95 కోట్ల రూపాయలకు […]

కళ్లుచెదిరే రేటుకు బాహుబలి ఓవర్సీస్ రైట్స్...
X

బాహుబలి-2 సినిమా ప్రకంపనలు మెల్లమెల్లగా ప్రారంభమయ్యాయి. సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుపుతున్నారు. వివిధ ప్రాంతాల్లో హక్కులకు సంబంధించి ఇప్పటికే నిర్మాతలు ఓ అవగాహనకు వచ్చారు. నైజాం, ఏపీ లాంటి హక్కుల్ని పక్కనపెడితే… మిగతా రాష్ట్రాలు, ఓవర్సీస్ కు సంబంధించి బిజినెస్ ను ముందుగానే క్లోజ్ చేయాలని నిర్మాతలు చూస్తున్నారు. ఇందులో భాగంగా… బాహుబలి-2 ఓవర్సీస్ హక్కుల్ని ఏకంగా 95 కోట్ల రూపాయలకు అమ్మేశారని తెలుస్తోంది. ఓ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో ఓవర్సీస్ ఎమౌంట్ దక్కడం నిజంగా సంచలనం. బాహుబలి -1 సినిమాకు విదేశాల్లో 70లక్షల డాలర్లు వచ్చాయి. అంటే దాదాపు 46 కోట్ల రూపాయలన్నమాట. కానీ బాహుబలి-2 కోసం 95 కోట్లు పెట్టడానికి ఓ కారణం ఉంది. కేవలం తెలుగు రైట్స్ మాత్రమే కాకుండా… హిందీ, తమిళ్ ఓవర్సీస్ హక్కుల్ని కూడా కలిపి ఈ మొత్తానికి అమ్మేశారు. అంతేకాదు… తమిళనాడులో బాహుబలి-2ను విడుదల చేసే హక్కులు కూడా ఇందులోనే కలిపి ఉన్నాయి. ఇలా అన్ని హక్కుల్ని కలుపుకొని ఏక మొత్తంగా 95 కోట్ల రూపాయలకు అమ్మేశారు. ఈ హక్కులు దక్కించుకోవడం కోసం ఎన్నో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ప్రయత్నించాడు. కానీ కె-ఎంటర్ టైన్ మెంట్స్ అనే ముక్కూమొహం తెలియని ఓ కొత్త సంస్థ… ఈ హక్కుల్ని దక్కించుకోవడం విశేషం.

First Published:  22 July 2016 11:09 AM GMT
Next Story