పక్కన కోడి ఉంటే మలేరియా వ్యాధి సోకదట
దోమల బారినుంచి తప్పించుకునేందుకు మనం అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాం. మార్కెట్లో లభిస్తున్న అనేక ఆల్ అవుట్ మస్కిటోలను, బ్యాట్లను వాడుతున్నాం. అయినా వాటి నుంచి తప్పించుకోవడం మనుషులకు పెద్ద సమస్యగా మారింది. దోమల బారిన పడకుండా ఉండడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోగాలు వ్యాపిస్తూనే ఉన్నాయి. అయితే మలేరియా రాకుండా ఉండడానికి పడుకునే టప్పుడు మంచం పక్కనే ఒక కోడిని పెట్టుకుంటే, ఈ వ్యాధి బారినుంచి మనుషులను రక్షించుకోవచ్చని చెప్పారు. వినేందుకు ఈ విఇషయం వింతగా అనిపించినా […]
దోమల బారినుంచి తప్పించుకునేందుకు మనం అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాం. మార్కెట్లో లభిస్తున్న అనేక ఆల్ అవుట్ మస్కిటోలను, బ్యాట్లను వాడుతున్నాం. అయినా వాటి నుంచి తప్పించుకోవడం మనుషులకు పెద్ద సమస్యగా మారింది. దోమల బారిన పడకుండా ఉండడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోగాలు వ్యాపిస్తూనే ఉన్నాయి. అయితే మలేరియా రాకుండా ఉండడానికి పడుకునే టప్పుడు మంచం పక్కనే ఒక కోడిని పెట్టుకుంటే, ఈ వ్యాధి బారినుంచి మనుషులను రక్షించుకోవచ్చని చెప్పారు. వినేందుకు ఈ విఇషయం వింతగా అనిపించినా ఇథియోపియాకు చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. దోమలకు మనిషి రక్తం రుచి మంచిగా తెలుసు. మనుషులను, జంతువులను కూడా కుట్టి రక్తం పీలుస్తాయి. అయితే కోళ్ల నుంచి వెలువడే ఒక రకమైన వాసన దోమలకు గిట్టదట. అందువల్ల దోమలకు వాటికి దూరంగా వెళ్లాలని ప్రయత్నిస్తాయని చెబుతున్నారు. ఇథియోపియా, స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్తలు, రక్తం పీల్చిన కొన్ని దోమలను పట్టుకుని వాటిలో రక్తాన్ని పరిశీలించగా, 1,200 దోమల్లో ఒక్క దోమ మాత్రమే కోడిని కుట్టి రక్తం పీల్చిందట. దీనిని బట్టి దోమలకు మనుషులు , పశువులు తప్ప కోళ్లంటే గిట్టదని అర్థమవుతోందని స్వీడిష్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు రికార్డ్ ఇగ్నల్ పేర్కొన్నారు. మలేరియా వ్యాధిని వ్యాపింప జేసే దోమలు కోళ్ల దరిదాపుల్లోకి అసలు రావడం లేదని మొదటిసారిగా తెలిసిందని దీని ఆధారంగా మలేరియా వ్యాధిని నివారించేందుకు చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.