Telugu Global
Cinema & Entertainment

మరోసారి తెలుగుతెరపైకి బ్రిటిష్ బ్యూటీ...

అప్పుడెప్పుడో రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది బ్రిటిష్ అందాలతార ఎమీ జాక్సన్. మళ్లీ ఆ తర్వాత నేరుగా తెలుగులో సినిమాలు చేసిన దాఖలాలు లేవు. శంకర్-విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఐ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించినప్పటికీ… అది స్ట్రయిట్ సినిమా కాదు. ఈమధ్య రవితేజ, రామ్ సినిమాల కోసం ఎమీని సంప్రదించారంటూ వార్తలు వచ్చినప్పటికీ అవి కూడా మెటీరియలైజ్ కాలేదు. అలా టాలీవుడ్ లో లాంగ్ గ్యాప్ తెచ్చుకున్న […]

మరోసారి తెలుగుతెరపైకి బ్రిటిష్ బ్యూటీ...
X
అప్పుడెప్పుడో రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది బ్రిటిష్ అందాలతార ఎమీ జాక్సన్. మళ్లీ ఆ తర్వాత నేరుగా తెలుగులో సినిమాలు చేసిన దాఖలాలు లేవు. శంకర్-విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఐ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించినప్పటికీ… అది స్ట్రయిట్ సినిమా కాదు. ఈమధ్య రవితేజ, రామ్ సినిమాల కోసం ఎమీని సంప్రదించారంటూ వార్తలు వచ్చినప్పటికీ అవి కూడా మెటీరియలైజ్ కాలేదు. అలా టాలీవుడ్ లో లాంగ్ గ్యాప్ తెచ్చుకున్న ఎమీ జాక్సన్ త్వరలోనే తెలుగుతెరపై కనువిందు చేయనుంది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
రోబో 2.0 షూటింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఎమీజాక్సన్ తన మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం తమిళ సినిమాలతోనే బిజీగా ఉన్నానని, అయితే త్వరలోనే నేరుగా తెలుగులో నటించే అవకాశముందని తెలిపింది. అయితే తను ఎవరి సరసన హీరోయిన్ గా నటించనుందనే విషయాన్ని మాత్రం ఎమీజాక్సన్ స్పష్టం చేయలేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఆమె తెలుగు అవకాశాలు వదులుకోవడానికి మెయిన్ రీజన్ ఇంకోటుంది. మన హీరోలెవరూ ఆమెకు మెయిన్ లీడ్ ఆఫర్ చేయడం లేదు. సెకెండ్ హీరోయిన్ పాత్రలు….కీలక పాత్రలు మాత్రమే చెబుతున్నారు. అందుకే తెలుగులో ఆమె ఏ ఆఫర్ ఒప్పుకోవడం లేదు.
First Published:  20 July 2016 5:47 AM GMT
Next Story