ఆడ పేరుతో మాయగాడి ఫేస్బుక్ ప్రేమ...యువకుడు బలి!
అనుశ్రీ అనే పేరుతో ఫేస్బుక్ ఖాతా ఓపెన్ చేసి, తన మాయలో చిక్కుకున్న యువకుల నుండి డబ్బు గుంజడం పనిగా పెట్టుకున్నాడు విశాఖకు చెందిన నాగభూషణం. అతని వలలో చిక్కుకుని ఓ యువకుడు అన్యాయంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఈ మాయలమారిని పోలీసులు అరెస్టు చేశారు. నాగభూషణం తన మిమిక్రీ కళతో అమ్మాయిలా తీయగా మాట్లాడగలడు. దాన్ని ఉపయోగించుకుని, ఫేస్బుక్లో పరిచయమైన కుర్రాళ్ల నుండి డబ్బుని రాబట్టుకునేవాడు. అలా అనుశ్రీ అనే పేరుతో అతను తెలుగురాష్ట్రాల్లో దాదాపు […]
అనుశ్రీ అనే పేరుతో ఫేస్బుక్ ఖాతా ఓపెన్ చేసి, తన మాయలో చిక్కుకున్న యువకుల నుండి డబ్బు గుంజడం పనిగా పెట్టుకున్నాడు విశాఖకు చెందిన నాగభూషణం. అతని వలలో చిక్కుకుని ఓ యువకుడు అన్యాయంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఈ మాయలమారిని పోలీసులు అరెస్టు చేశారు.
నాగభూషణం తన మిమిక్రీ కళతో అమ్మాయిలా తీయగా మాట్లాడగలడు. దాన్ని ఉపయోగించుకుని, ఫేస్బుక్లో పరిచయమైన కుర్రాళ్ల నుండి డబ్బుని రాబట్టుకునేవాడు. అలా అనుశ్రీ అనే పేరుతో అతను తెలుగురాష్ట్రాల్లో దాదాపు 50మంది యువకులను మోసం చేశాడు. రకరకాల కారణాలు చూపి వారి నుండి డబ్బు లాగుతూ జల్సాలు చేసేవాడు.
కడప జిల్లా ఖాజీపేటకు చెందిన నరసింహ వరప్రసాద్ కూడా అలాగే అతని వలలో చిక్కుకున్నాడు. ఖాజీపేటలో టీకొట్టు నడుపుతున్నవర ప్రసాద్, నాగభూషణం అమ్మాయేననే నమ్మకంతో అతను అడిగినప్పుడల్లా డబ్బు పంపుతుండేవాడు. ఈ క్రమంలో ఒక రోజు నాగభూషణం, వర ప్రసాద్‌ని నన్ను పెళ్లి చేసుకుంటావా…అని అడిగాడు. అందుకు సరేనన్నాడు అతను. ఇది జరిగిన తరువాత నాగభూషణం, వర ప్రసాద్‌తో మాట్లాడటం మానేశాడు. వర ప్రసాద్ ఈ విషయం గురించి అడుగుతుండగా, అతనిపై వేధింపుల కేసు పెడతానని నాగభూషణం బెదిరించాడు.
దాంతో భయపడిపోయిన వర ప్రసాద్, తన ఆత్మహత్యకు ఫేస్ బుక్ ఫ్రెండ్ అనుశ్రీయే కారణమని లెటరు రాసి, గత నెల 20న తన ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయాడు. ఖాజీపేట పోలీసులు ఈ కేసు విచారణ చేపట్టి వివరాలు సేకరించగా నాగభూషణం బండారం బయటపడింది. పోలీసులు ఆ మాయగాడిని అరెస్టు చేశారు. శుక్రవారం ఖాజీపేటలో ఈ వివరాలను పోలీస్ అధికారులు వెల్లడించారు.