Telugu Global
NEWS

బాబు కూడా కేసీఆర్ తోకేనా?

తిట్టే నోరు తిరిగే కాలు ఊరికే ఉండ‌వంటారు పెద్ద‌లు. ఈ సామెత టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి స‌రిగ్గా స‌రిపోతుంది. ఓటుకు నోటు కేసులో జైలు  జీవితం అనుభ‌వించాక‌.. ఈయ‌న మాటల్లో మ‌రింత ముదిరాడు. కేసీఆర్‌ను తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. కేసీఆర్‌ను పొగిడిన వాళ్లంద‌రూ అత‌ని చెంచాలుగా అభివ‌ర్ణిస్తూ.. త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్కుతున్నాడు. తాజాగా కేంద్రంలో ఉన్న బీజేపీ స‌ర్కారు కూడా కేసీఆర్ కు తోక‌పార్టీగా మారింద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసి మ‌రోసారి త‌న నోటిదురుసును […]

బాబు కూడా కేసీఆర్ తోకేనా?
X
తిట్టే నోరు తిరిగే కాలు ఊరికే ఉండ‌వంటారు పెద్ద‌లు. ఈ సామెత టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి స‌రిగ్గా స‌రిపోతుంది. ఓటుకు నోటు కేసులో జైలు జీవితం అనుభ‌వించాక‌.. ఈయ‌న మాటల్లో మ‌రింత ముదిరాడు. కేసీఆర్‌ను తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. కేసీఆర్‌ను పొగిడిన వాళ్లంద‌రూ అత‌ని చెంచాలుగా అభివ‌ర్ణిస్తూ.. త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్కుతున్నాడు. తాజాగా కేంద్రంలో ఉన్న బీజేపీ స‌ర్కారు కూడా కేసీఆర్ కు తోక‌పార్టీగా మారింద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసి మ‌రోసారి త‌న నోటిదురుసును చాటుకున్నాడు.
రాష్ట్ర్రాల సీఎంల స‌మావేశం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ ర‌హ‌స్యంగా ఓ స‌ర్వే చేయించారు. అందులో కేసీఆర్‌కు నెం.1 ర్యాంకు వ‌చ్చింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త విన్న రేవంత్ రెడ్డికి ఆరోజునుంచి నిద్ర క‌రువైన‌ట్లుంది. అందుకే, కేసీఆర్ కు ర్యాంకు ఇచ్చిన బీజేపీపైనా మాట‌ల దాడి చేసేశాడు. సచివాల‌యానికి రాని సీఎంను దేశంలో నెం.1 ముఖ్య‌మంత్రిగా ఎలా ప్ర‌క‌టిస్తారు? అని నిల‌దీశాడు. ప‌ని చేయ‌కుండా.. పడుకునే సీఎంకు నెం.1 ర్యాంకు రావ‌డం న‌మ్మ‌శక్యంగా లేద‌ని, కేంద్రంలోని బీజేపీ కేసీఆర్‌కు తోక‌పార్టీగా మారింద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశాడు.
విచిత్రమేంటంటే.. ఏపీలో మంత్రులంద‌రికీ బాబు ఏ ప్రాతిప‌దిక‌న ర్యాంకులు ఇస్తున్నాడో.. రేవంత్ కు క‌నిపించ‌డం లేదు. అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న ఓ ఏపీ మంత్రికి బాబు నెం.1 ర్యాంకు ఇచ్చిన‌పుడు రేవంత్ ఎక్క‌డ ఉన్నాడు. తాజాగా దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని నేషనల్ కౌన్సిల్ ఫర్‌ అప్లయిడ్ ఎకనామిక్‌ రిసెర్చ్ (NCAER) నిర్వహించిన సర్వే వివరాలను రేవంత్ ప‌త్రిక‌ల్లో, టీవీల్లో చూడ‌లేదా? అని టీఆర్ఎస్ నాయకులు గుర్తుచేస్తున్నారు. తెలంగాణ సీఎంకు నెం.1 ర్యాంకు వ‌చ్చేస‌రికి మాత్రం ఎక్క‌డ‌లేని అస‌హ‌నాన్ని వెళ్ల‌గ‌క్కుతున్నాడు.. (కాదు కాదు.. కేసీఆర్ ప్ర‌తిష్ట‌ను మ‌రింత పెంచుతున్నాడు.) మేయ‌ర్లను విమాన స‌ర్వీసులు న‌డపాల‌ని, స‌త్య నాదెళ్ల‌కు కంప్యూట‌ర్స్ కోర్సు చ‌ద‌వ‌మ‌ని నేనే చెప్పాన‌ని చెప్పుకుని న‌లుగురిలో న‌వ్వుల‌పాలైన చంద్ర‌బాబు గొప్ప‌ల తిప్ప‌లు ఏమాత్రం సిగ్గుచేటుగా అనిపించ‌లేదా ? కేసీఆర్ ను పొగిడిన వాళ్లంతా ఆయ‌న‌కు తోక‌లైతే.. అమ‌రావ‌తి శంకుస్థాప‌న, కేసీఆర్ చండీయాగం సంద‌ర్భంగా బాబు కూడా కేసీఆర్ ను పొగిడాడు క‌దా? మ‌రి బాబును తిట్ట‌వేం రేవంత్ రెడ్డి? ఈ లెక్కన ఏపీసీఎం చంద్ర‌ బాబు కూడా కేసీఆర్ కు తోక అవ్వాలి క‌దా! అలా అయితే ప‌రోక్షంగా నువ్వు కూడా తోక‌వే అవుతావుగా..! ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్స‌య్యావు? అని టీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

Click on Image to Read:

gali-muddu-krishnama-naidu

tdp-vijaya-jyothi

katti-padmarao-new

srivani

eenadu-story

babu-lokesh

11212

ambati

chandrababu-modi

ysrcp1

sabbam-hari

r-vidyasagar-rao

babu-movie

First Published:  15 July 2016 10:23 PM GMT
Next Story