Telugu Global
Cinema & Entertainment

టాలీవుడ్ లో ఈమె ప్లేస్ మాత్రం పదిలం

ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య గట్టిపోటీ ఉంది. ఒకరి అవకాశాన్ని మరొకరు తన్నుకుపోవడం చాలా సహజం అయిపోయింది. కానీ ఒకేఒక్క హీరోయిన్ మాత్రం ఈ లెక్కలకు దూరంగా కెరీర్ లాగించేస్తోంది. తనకు ఎవరూ పోటీలేని విధంగా చూసుకుంది. ఆమె పేరు క్యాథరీన్ థ్రెసా. అవును… ఇప్పుడీమెకు ఎవరూ పోటీలేరు. ఆమెకు ఆమెతోనే పోటీ. ఎందుకంటే.. ఆమె చేసేది హీరోయిన్ వేషాలు కాదు కాబట్టి. అన్నీ సెకెండ్ హీరోయిన్ పాత్రలే కాబట్టి… ఆమెకు పోటీగా ఇప్పటివరకు ఎవరూ నిలవలేదు. […]

టాలీవుడ్ లో ఈమె ప్లేస్ మాత్రం పదిలం
X

ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య గట్టిపోటీ ఉంది. ఒకరి అవకాశాన్ని మరొకరు తన్నుకుపోవడం చాలా సహజం అయిపోయింది. కానీ ఒకేఒక్క హీరోయిన్ మాత్రం ఈ లెక్కలకు దూరంగా కెరీర్ లాగించేస్తోంది. తనకు ఎవరూ పోటీలేని విధంగా చూసుకుంది. ఆమె పేరు క్యాథరీన్ థ్రెసా. అవును… ఇప్పుడీమెకు ఎవరూ పోటీలేరు. ఆమెకు ఆమెతోనే పోటీ. ఎందుకంటే.. ఆమె చేసేది హీరోయిన్ వేషాలు కాదు కాబట్టి. అన్నీ సెకెండ్ హీరోయిన్ పాత్రలే కాబట్టి… ఆమెకు పోటీగా ఇప్పటివరకు ఎవరూ నిలవలేదు.

ఇద్దరమ్మాయిలతో సినిమాలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించిన క్యాథరీన్… ఆ తర్వాత రేసుగుర్రంలో కూడా సెకెండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి 150వ సినిమాలో కూడా సెకెండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. బాలయ్య వందో సినిమాలో కూడా ఓ పాత్ర దక్కించుకుంది. ఈమధ్యే రానా-కాజల్ నటిస్తున్న సినిమాలో కూడా సెకెండ్ లీడ్ కొట్టేసింది. తాజాగా గోపీచంద్-హన్సిక కాంబోలో సంపత్ నంది దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా క్యాథరీన్ సెకెండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. ఇలా చాలా సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ పాత్రలు క్యాథరీన్ కే వస్తున్నాయి. క్యారెక్టర్ రోల్స్ లో అయినా పోటీ ఉందేమో కానీ… ఆ సెగ్మెంట్ లో మాత్రం పెద్దగా పోటీలేకపోవడంతో క్యాథరీన్ దూసుకుపోతోంది.

First Published:  16 July 2016 4:49 AM GMT
Next Story