Telugu Global
Cinema & Entertainment

మొదటి హీరోనే నిలువునా ముంచేసిన నిహారిక

పాపం… నాగశౌర్య. ఎన్నో ఆశలతో రికమండేషన్లు చేయించుకొని మరీ నిహారిక సరసన నటించాడు. ఒక మనసు సినిమాలో ఛాన్స్ కోసం తెరవెనక చాలా పావులు కదిపాడు. ఎంతోమందితో లాబీయింగ్ చేయించాడు. ఇంత చేయడానికి కారణం ఒకటే. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న మొట్టమొదటి హీరోయిన్ నిహారిక సరసన నటిస్తే…. సినిమా హిట్టవ్వడంతో పాటు తనకు కూడా ఇంకాస్త క్రేజ్ పెరుగుతుందని ఆశ పడ్డాడు. అయితే సినిమా విడుదలైన తర్వాత తనది ఆశ కాదని, అత్యాశ అని అర్థం […]

మొదటి హీరోనే నిలువునా ముంచేసిన నిహారిక
X
పాపం… నాగశౌర్య. ఎన్నో ఆశలతో రికమండేషన్లు చేయించుకొని మరీ నిహారిక సరసన నటించాడు. ఒక మనసు సినిమాలో ఛాన్స్ కోసం తెరవెనక చాలా పావులు కదిపాడు. ఎంతోమందితో లాబీయింగ్ చేయించాడు. ఇంత చేయడానికి కారణం ఒకటే. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న మొట్టమొదటి హీరోయిన్ నిహారిక సరసన నటిస్తే…. సినిమా హిట్టవ్వడంతో పాటు తనకు కూడా ఇంకాస్త క్రేజ్ పెరుగుతుందని ఆశ పడ్డాడు. అయితే సినిమా విడుదలైన తర్వాత తనది ఆశ కాదని, అత్యాశ అని అర్థం చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే నాగశౌర్య కెరీర్ ను ఇంకాస్త వెనక్కి లాగేసింది మెగా హీరోయిన్ నిహారిక.
ఒక మనసు సినిమాకు ముందు నాగశౌర్యకు మంచి మార్కెట్ ఉండేది. ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి పేరుతెచ్చుకున్న ఈ హీరో… కల్యాణ్ వైభోగమే, లక్ష్మీరావే మా ఇంటికి, దిక్కులు చూడకు రామయ్య వంటి సినిమాలతో మంచి పేరే తెచ్చుకున్నాడు. ఇలాంటి టైమ్ లో నిహారికతో కలిసి నటిస్తే క్రేజ్ డబుల్ అవుతుందని ఆశపడ్డాడు. కానీ ఒక మనసు విడుదల తర్వాత నాగశౌర్య మార్కెట్ తగ్గిపోయినట్టు కనిపిస్తోంది. మరో సినిమా అవకాశం అందుకునే క్రమంలో… నాగశౌర్య తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నట్టు సమాచారం. మళ్లీ అతనికి ఊహలు గుసగుసలాడే తరహాలో ఓ మంచి హిట్ పడితే తప్ప కెరీర్ గాడిలో పడదు.
Click on Image to Read:
sania-rajdeep
srivani
janatha-garage-release-date
ram-charan
allari-naresh
First Published:  15 July 2016 5:34 AM GMT
Next Story