Telugu Global
Cinema & Entertainment

ఇది  పెట్టుకుంటే... రజనీకాంత్ తో మాట్లాడినట్టే...

కబాలి సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. తెలుగు-తమిళ భాషల్లో సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే కబాలికి సంబంధించి ప్రచారం మొదలైంది. ఎయిర్ ఏషియా సంస్థ అయితే తమ సంస్థకు చెందిన కొన్ని విమానాలపై ఏకంగా కబాలి పోస్టర్ ముద్రించింది. దీనికి కొనసాగింపుగా… మరో వినూత్న ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేసింది కబాలి టీం. ఎయిర్ టెల్ తో ఒప్పందం చేసుకున్న ఈ టీం… అభిమానుల […]

ఇది  పెట్టుకుంటే... రజనీకాంత్ తో మాట్లాడినట్టే...
X
కబాలి సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. తెలుగు-తమిళ భాషల్లో సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే కబాలికి సంబంధించి ప్రచారం మొదలైంది. ఎయిర్ ఏషియా సంస్థ అయితే తమ సంస్థకు చెందిన కొన్ని విమానాలపై ఏకంగా కబాలి పోస్టర్ ముద్రించింది. దీనికి కొనసాగింపుగా… మరో వినూత్న ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేసింది కబాలి టీం. ఎయిర్ టెల్ తో ఒప్పందం చేసుకున్న ఈ టీం… అభిమానుల కోసం ప్రత్యేకంగా కబాలి సిమ్ కార్డును విడుదల చేసింది. ఈ సిమ్ పై కబాలి గెటప్ లో ఉన్న రజనీ ఫొటో ముద్రించి ఉంటుంది. ఈ సిమ్ తో పాటు ప్రత్యేకమైన డేటా ప్యాక్ లు, టాక్ టైమ్ ఆఫర్లు కూడా ప్రకటించింది ఎయిర్ టెల్.
ఓ వైపు కబాలికి ప్రమోషన్ కల్పిస్తూనే… మరోవైపు తమ అమ్మకాలు పెంచుకునేందుకు ఎయిర్ టెల్ ఈ వినూత్న ఎత్తుగడ వేసింది. అయితే ప్రస్తుతం ఈ ఆఫర్ తమిళనాడుకు మాత్రమే పరిమితం చేసింది ఎయిర్ టెల్ సంస్థ. ప్రస్తుతం తమిళనాట ఈ సిమ్ కార్డులు జోరుగా అమ్ముడుపోతున్నాయి. తలైవ ఫ్యాన్స్ అంతా ఎగబడి మరీ ఈ సిమ్ములు కొంటున్నారు. మరోవైపు కబాలిని ప్రదర్శించనున్న థియేటర్లను అభిమానులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
అటు ఈ సినిమాను సింగపూర్ లో ప్రదర్శించేందుకు గాను… ఒకప్పటి స్టార్ హీరో, ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్… కబాలి రైట్స్ దక్కించుకున్నారు. కణ్నన్ తో ఉన్న సాన్నిహత్యం కొద్దీ అతడికి డెడ్ చీప్ గా సింగపూర్ రైట్స్ ఇచ్చేసినట్టు టాక్. సింగపూర్ లో తమిళవాసులు ఎక్కువమంది ఉన్నారు. థియేటర్లు తక్కువగా ఉన్నప్పటికీ… దాదాపు 2 వారాల పాటు కబాలిని అక్కడ ప్రదర్శించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు కణల్ కణ్నన్.
First Published:  13 July 2016 4:50 AM GMT
Next Story