Telugu Global
Cinema & Entertainment

బాహుబలి నుంచి మరో వీడియో....

ఇదేదో బాహుబలి-2కు సంబంధించిన వీడియో అనుకోవద్దు. ఏడాది కిందట విడుదలైన బాహుబలి సినిమాకు సంబంధించిన వీడియోనే తాజాగా విడుదల చేశారు. ఇలా చేయడానికి ఓ కారణం కూడా ఉంది. బాహుబలి సినిమా గతేడాది జులై 10న విడుదలైంది. అంటే మొన్నటికి సరిగ్గా ఏడాది పూర్తిచేసుకుందన్నమాట. ఈ సందర్భంగా మేకర్స్ ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. బాహుబలి సినిమా కోసం తాము ఎంత కష్టపడ్డామో వివరించేలా ఆ మేకింగ్ వీడియో ఉంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్న, […]

బాహుబలి నుంచి మరో వీడియో....
X

ఇదేదో బాహుబలి-2కు సంబంధించిన వీడియో అనుకోవద్దు. ఏడాది కిందట విడుదలైన బాహుబలి సినిమాకు సంబంధించిన వీడియోనే తాజాగా విడుదల చేశారు. ఇలా చేయడానికి ఓ కారణం కూడా ఉంది. బాహుబలి సినిమా గతేడాది జులై 10న విడుదలైంది. అంటే మొన్నటికి సరిగ్గా ఏడాది పూర్తిచేసుకుందన్నమాట. ఈ సందర్భంగా మేకర్స్ ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. బాహుబలి సినిమా కోసం తాము ఎంత కష్టపడ్డామో వివరించేలా ఆ మేకింగ్ వీడియో ఉంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్న, సత్యరాజ్ తో పాటు… దర్శకుడు రాజమౌళి ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్థమైపోతుంది. పైగా గ్రాఫిక్స్ లో చూసిన బాహుబలికి, మేకింగ్ సమయంలో చూసిన బాహుబలికి తేడాను సులభంగా గుర్తుపట్టేలా వీడియో ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఈ మేకింగ్ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బాహుబలి సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరోవైపు చైనాలో ఇంకొన్ని రోజుల్లో విడుదలకానుంది. మరోవైపు బాహుబలి పార్ట్-2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంచనాలు మరింత పెరగకుండా ఉండేందుకు… అత్యంత గోప్యంగా, ఎలాంటి చడీచప్పుడు లేకుండా సినిమా షూటింగ్ ను కానిచ్చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా బాహుబలి-2 అలరించనుంది.

First Published:  11 July 2016 10:44 PM GMT
Next Story