Telugu Global
Cinema & Entertainment

బన్నీ భామ... రానా సరసన...

బన్నీకి ఆమె ఎంతో ఇష్టమైన హీరోయిన్. అందుకే 15 ఏళ్ల సెంటిమెంట్ ను కూడా పక్కనపెట్టి ఆమెను రెండోసారి రిపీట్ చేశాడు. (ఇప్పటివరకు బన్నీ ఏ హీరోయిన్ ను రిపీట్ చేయలేదు) రెండోసారి మళ్లీ రిపీట్ చేసినందుకు సరైనోడు సక్సెస్ తో మంచి ఫలితాన్నే అఁదుకున్నాడు. ఇంతకీ ఆ భామ ఎవరనుకుంటున్నారా… ఆమె మరెవరో కాదు. క్యాథరీన్ థ్రెసా. గతంలో ఇద్దరమ్మాయిలతో సినిమాలో బన్నీ సరసన నటించిన ఈ చిన్నది మరోసారి సరైనోడులో అల్లువారబ్బాయ్ సరసన తళుక్కున […]

బన్నీ భామ... రానా సరసన...
X

బన్నీకి ఆమె ఎంతో ఇష్టమైన హీరోయిన్. అందుకే 15 ఏళ్ల సెంటిమెంట్ ను కూడా పక్కనపెట్టి ఆమెను రెండోసారి రిపీట్ చేశాడు. (ఇప్పటివరకు బన్నీ ఏ హీరోయిన్ ను రిపీట్ చేయలేదు) రెండోసారి మళ్లీ రిపీట్ చేసినందుకు సరైనోడు సక్సెస్ తో మంచి ఫలితాన్నే అఁదుకున్నాడు. ఇంతకీ ఆ భామ ఎవరనుకుంటున్నారా… ఆమె మరెవరో కాదు. క్యాథరీన్ థ్రెసా. గతంలో ఇద్దరమ్మాయిలతో సినిమాలో బన్నీ సరసన నటించిన ఈ చిన్నది మరోసారి సరైనోడులో అల్లువారబ్బాయ్ సరసన తళుక్కున మెరిసింది. ఇప్పుడా బ్యూటీని, ఆ విజయాన్ని తన సొంతం చేసుకోవాలని రానా భావిస్తున్నాడు.

బాహుబలితో రానా హిట్ అందుకున్నప్పటికీ… అది అందరి ఖాతాలోకి వెళ్లిపోయింది. రానాతో పాటు… ప్రభాస్, రాజమౌళి, నిర్మాతలు ఇలా అంతా ఆ విజయాన్ని షేర్ చేసుకున్నారు. నిజం చెప్పాలంటే.. రానాకు సోలో సక్సెస్ అన్నదే ఈమధ్య కాలంలో లేకుండా పోయింది. అందుకే తేజ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా సినిమా చేస్తున్నాడు రానా. ఈ మూవీతో ఎలాగైనా సోలో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాలోనే సెకెండ్ హీరోయిన్ గా క్యాథరీన్ ను తీసుకున్నారు. ఇప్పటికే సెకెండ్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయిన క్యాథరీన్… రానా కోరిన వెంటనే అతడి సినిమాలో నటించేందుకు కాల్షీట్లు కేటాయించింది. త్వరలోనే క్యాథరీన్ పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారు.

First Published:  10 July 2016 2:01 AM GMT
Next Story