Telugu Global
Health & Life Style

ఇవి మ‌ధుమేహాన్ని ఆపుతాయి!

కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు మ‌ధుమేహం రిస్క్‌ని త‌గ్గిస్తాయ‌ని, దాన్ని రాకుండా నివారిస్తాయ‌ని ఆరోగ్య ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. అవి- ప‌నుపు; ఇందులో ఉన్న క‌ర్‌క్యుమిన్‌లో మ‌ధుమేహాన్ని ఆపే శ‌క్తి ఉంది. ఇది ఈ ముప్పుని కొంత‌కాలం వ‌ర‌కు నివారించ‌గ‌ల‌ద‌ని పరిశోధ‌కులు చెబుతున్నారు. దీనిపై ఇంకా రీసెర్చి జ‌ర‌గాల్సి ఉంది. స్ట్రా బెర్రీస్‌; వీటిని రోజూ తిన‌టం వ‌ల‌న ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్‌ని, కొవ్వుల‌ను త‌గ్గించే శ‌క్తి ఉన్న ప్రొటీన్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌, కొవ్వులు త‌గ్గ‌టం వ‌ల‌న మ‌ధుమేహం […]

ఇవి మ‌ధుమేహాన్ని ఆపుతాయి!
X

కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు మ‌ధుమేహం రిస్క్‌ని త‌గ్గిస్తాయ‌ని, దాన్ని రాకుండా నివారిస్తాయ‌ని ఆరోగ్య ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

అవి- ప‌నుపు; ఇందులో ఉన్న క‌ర్‌క్యుమిన్‌లో మ‌ధుమేహాన్ని ఆపే శ‌క్తి ఉంది. ఇది ఈ ముప్పుని కొంత‌కాలం వ‌ర‌కు నివారించ‌గ‌ల‌ద‌ని పరిశోధ‌కులు చెబుతున్నారు. దీనిపై ఇంకా రీసెర్చి జ‌ర‌గాల్సి ఉంది.

స్ట్రా బెర్రీస్‌; వీటిని రోజూ తిన‌టం వ‌ల‌న ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్‌ని, కొవ్వుల‌ను త‌గ్గించే శ‌క్తి ఉన్న ప్రొటీన్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌, కొవ్వులు త‌గ్గ‌టం వ‌ల‌న మ‌ధుమేహం ముప్పు త‌గ్గుతుంది. ఎలుక‌ల్లో చేసిన ప‌రిశోధ‌న‌ల్లో స్ట్రాబెర్రీస్ ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిని త‌గ్గిస్తాయ‌ని తేలింది.

పెరుగు; కొవ్వు త‌క్కువగా ఉన్న పెరుగుని తీసుకోవ‌టం వ‌ల‌న శ‌రీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది షుగ‌ర్ వ‌చ్చే అవ‌కాశాల‌ను త‌గ్గిస్తుంది. ఛీజ్‌లో కూడా ఇలాంటి ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

దాల్చిన చెక్క‌; ఇందులో ఆరోగ్య లాభాలు చాలా ఉన్నాయి. ఇది ఉద‌యం పూట ర‌క్తంలో గ్లూకోజ్‌ స్థాయిని త‌గ్గిస్తుంది. ట్రైగ్లిజ‌రైడ్స్ అనే కొవ్వుల‌ను, చెడు కొలెస్ట్రాల్‌ని త‌గ్గించి ఇన్సులిన్‌ ప‌నితీరుని మెరుగుప‌రుస్తుంది. టీ కాఫీల్లోనో, ఆహారంలోనో కాస్త దాల్చిన చెక్క పొడిని చ‌ల్లుకుంటే మంచిది.

యాపిల్స్‌; ఇందులో ఉన్న అంథోసియానిన్ ర‌క్తంలోని షుగ‌ర్ లెవ‌ల్స్‌ని క్ర‌మ‌బ‌ద్ధం చేస్తుంది.

పాల‌కూర‌; ఇందులో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే పోష‌కాలు చాలా ఉన్నాయి. ఒక బ్రిటీష్ అధ్య‌య‌నాన్ని బ‌ట్టి రోజూ పాల‌కూర తింటే మ‌ధుమేహం రిస్క్ 14శాతం వ‌ర‌కు త‌గ్గుతుంది.

First Published:  8 July 2016 7:13 AM GMT
Next Story