Telugu Global
Cinema & Entertainment

రఫ్పాడిస్తున్న జనతా గ్యారేజీ టీజర్

అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ఎన్టీఆర్ ఆశలు నెరవేరాయి. ఊహించినట్టే జనతా గ్యారేజ్ టీజర్ సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తోంది. ఏ ఫ్లాట్ పాంలో చూసినా లైకులు, హిట్స్, షేరులే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యూట్యూబ్ లో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. విడుదలైన 100 నిమిషాల్లోనే ఈ సినిమా టీజర్ కు 30వేల లైకులు వచ్చాయి. ఒక్క యూట్యూబ్ ఛానెల్ లోనే ఇది ఇప్పటివరకు 45వేల లైకుల వరకు సంపాదించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో […]

రఫ్పాడిస్తున్న జనతా గ్యారేజీ టీజర్
X

అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ఎన్టీఆర్ ఆశలు నెరవేరాయి. ఊహించినట్టే జనతా గ్యారేజ్ టీజర్ సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తోంది. ఏ ఫ్లాట్ పాంలో చూసినా లైకులు, హిట్స్, షేరులే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యూట్యూబ్ లో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. విడుదలైన 100 నిమిషాల్లోనే ఈ సినిమా టీజర్ కు 30వేల లైకులు వచ్చాయి. ఒక్క యూట్యూబ్ ఛానెల్ లోనే ఇది ఇప్పటివరకు 45వేల లైకుల వరకు సంపాదించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో యూట్యూబ్ లో జనతా గ్యారేజ్ దే రికార్డు. మొన్నటివరకు సోషల్ మీడియాలో వీక్ అనుకున్న తారక్ సృష్టించిన ప్రభంజనం ఇది.

ఈ టీజర్ కు ఇంత హైప్ రావడానికి ప్రధానం కారణం ఇద్దరు వ్యక్తులే. అందులో మొదటి వ్యక్తి తారక్ అయితే.. రెండో వ్యక్తి కొరటాల శివ. నాన్నకు ప్రేమతో లాంటి సూపర్ సక్సెస్ తర్వాత తారక్ చేస్తున్న మూవీ కావడంతో జనతా గ్యారేజ్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు శ్రీమంతుడు లాంటి సూపర్ సక్సెస్ తర్వాత కొరటాల శివ డైరక్ట్ చేస్తున్న సినిమా కూడా ఇదే కావడంతో ఆ అంచనాలు ఆకాశాన్నంతాయి. వెరసి…జనతా గ్యారేజ్ పై ఏ రేంజ్ లో అంచనాలున్నాయో సోషల్ మీడియా లెక్కలే చెబుతున్నాయి.

మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే జనతా గ్యారేజ్ లో తారక్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఆడియోను త్వరలోనే విడుదల చేసి.. .సినిమాను వచ్చేనెల 12న థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

Janatha Garrage Teaser

First Published:  7 July 2016 3:36 AM GMT
Next Story