కుమార్తె,కోడల్ని ఇచ్చి తాకట్టు విడిపించుకోమన్న రుణదాత
తీసుకున్న అప్పు మాఫీ చేసేందుకు ఓ రైతు కుమార్తెను, ఆయన కోడలిని తన సహచర్యానికి పంపమన్న రుణదాత అమానుష డిమాండ్ మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు రైతు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని బీడ్ జిల్లా ఎస్పీ అనిల్ పరస్కర్ తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ విజయ రహట్కర్ ఈ విషయమై తనను పిలిపించి మాట్లాడారని, ఈ సంఘటనపై తనను నివేదిక పంపించవలసిందిగా ఆదేశించారని తెలిపారు. తన భూమిని రుణదాత అప్పు కింద స్వాధీనం చేసుకున్నాడని […]
తీసుకున్న అప్పు మాఫీ చేసేందుకు ఓ రైతు కుమార్తెను, ఆయన కోడలిని తన సహచర్యానికి పంపమన్న రుణదాత అమానుష డిమాండ్ మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు రైతు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని బీడ్ జిల్లా ఎస్పీ అనిల్ పరస్కర్ తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ విజయ రహట్కర్ ఈ విషయమై తనను పిలిపించి మాట్లాడారని, ఈ సంఘటనపై తనను నివేదిక పంపించవలసిందిగా ఆదేశించారని తెలిపారు. తన భూమిని రుణదాత అప్పు కింద స్వాధీనం చేసుకున్నాడని ఏప్రిల్లో ఆ రైతు ఫిర్యాదు చేశాడు. అప్పు మాఫీ చేయాలంటే నీ కుమార్తెను, కోడల్ని తన సహచర్యానికి పంపించాలని రుణదాత భగవాన్ బడే డిమాండ్ చేస్తున్నాడని బీడ్ జిల్లా థరూర్ తహసిల్కు చెందిన ఇందర్ ముండే అనే రైతు ఇటీవల ఫిర్యాదు చేశాడు అని ఎస్పీ వెల్లడించారు. మీడియా ద్వారానే తనకు ఈ విషయం తెలిసిందని దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకుంటామని ఎస్సీ వెల్లడించారు.