Telugu Global
Cinema & Entertainment

రేపే జనతా గ్యారేజీ టీజర్

ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ జనతా గ్యారేజీ రేపట్నుంచి మరో మలుపు తిరగనుంది. ఈ సినిమాకు సంబంధించి రేపు టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా… తాజాగా టీజర్ కు సంబంధించి డబ్బింగ్ ను కూడా ఎన్టీఆర్ పూర్తిచేశాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి టాకీ పార్ట్ మొత్తాన్ని కొరటాల శివ కంప్లీట్ చేశాడు. త్వరలోనే పాటల షూటింగ్ కోసం కొలంబో వెళ్లబోతున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ […]

రేపే జనతా గ్యారేజీ టీజర్
X

ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ జనతా గ్యారేజీ రేపట్నుంచి మరో మలుపు తిరగనుంది. ఈ సినిమాకు సంబంధించి రేపు టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా… తాజాగా టీజర్ కు సంబంధించి డబ్బింగ్ ను కూడా ఎన్టీఆర్ పూర్తిచేశాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి టాకీ పార్ట్ మొత్తాన్ని కొరటాల శివ కంప్లీట్ చేశాడు. త్వరలోనే పాటల షూటింగ్ కోసం కొలంబో వెళ్లబోతున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. దేవిశ్రీ కంపోజ్ చేసిన పాటల్ని… ఈ నెలాఖరులోనే విడుదల చేసి… సినిమాను వచ్చేనెల 12న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు. సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో మోహన్ లాల్, ఉన్ని ముకుందన్, సాయికుమార్, దేవయాని కనిపిస్తారు. కొలంబో షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే… ఆడియో ఫంక్షన్ వరకు వెయిట్ చేయకుండా.. దశలవారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈసారి జనతా గ్యారేజీతో మలయాళంలో కూడా స్వింగ్ లోకి రావాలని అనుకుంటున్నాడు తారక్. మోహన్ లాల్ తో భారీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. మలయాళ హక్కుల్ని కూడా మోహన్ లాల్ కే అప్పగించారు.

Click on Image to Read:

balakrishna-100th-movie

niharika

allu-arjun

pawan

nagachitanya-samantha

regina-chiru-150-movie

tamanna diet

First Published:  5 July 2016 1:35 AM GMT
Next Story