Telugu Global
Cinema & Entertainment

తల్లి కాబోతున్న బెబో

హాట్ హీరోయిన్ కరీనాకపూర్ త్వరలోనే తల్లి కాబోతోంది. ఇది రూమర్ కాదు. ఈ విషయాన్ని ఆమె భర్త సైఫ్ అలీఖాన్ ప్రకటించాడు. ప్రస్తుతం లండన్ లో ఉంటున్న కరీనా కపూర్…. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోందనే విషయాన్ని సైఫ్ స్పష్టంచేశాడు. ఈమధ్య గర్భందాల్చిన కరీనా ఫొటోలు నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. అవన్నీ నిజమేనని సైఫ్ కన్ ఫర్మ్ చేశాడు. ఈ ఏడాది చివర్లో… అంటే డిసెంబర్ లో తను తండ్రి కాబోతున్నట్టు సైఫ్ ప్రకటించాడు. సైఫ్ ప్రకటనతో […]

తల్లి కాబోతున్న బెబో
X

హాట్ హీరోయిన్ కరీనాకపూర్ త్వరలోనే తల్లి కాబోతోంది. ఇది రూమర్ కాదు. ఈ విషయాన్ని ఆమె భర్త సైఫ్ అలీఖాన్ ప్రకటించాడు. ప్రస్తుతం లండన్ లో ఉంటున్న కరీనా కపూర్…. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోందనే విషయాన్ని సైఫ్ స్పష్టంచేశాడు. ఈమధ్య గర్భందాల్చిన కరీనా ఫొటోలు నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. అవన్నీ నిజమేనని సైఫ్ కన్ ఫర్మ్ చేశాడు. ఈ ఏడాది చివర్లో… అంటే డిసెంబర్ లో తను తండ్రి కాబోతున్నట్టు సైఫ్ ప్రకటించాడు.

సైఫ్ ప్రకటనతో కరీనా కెరీర్ కు దాదాపు ఫుల్ స్టాప్ పడినట్టయింది. తాజాగా ఆమె ఉడ్తా పంజాబ్ అనే సిినిమాలో నటించింది. ఇదే ఆమెకు ఆఖరి సినిమా కానుంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆలనాపాలన చూసుకొని, ఓ మూడేళ్ల విరామం తర్వాత బెబో మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సో… ఉడ్తా పంజాబే ఆమెకు చివరి చిత్రం. డెలవరీ అయ్యేంతవరకు లండన్ లోనే ఉండాలని కూడా కరీనా నిర్ణయించుకుంది. సైఫ్ ఈ విషయాల్ని అధికారికంగా వెల్లడించనప్పటికీ… ఈ ఏడాది చివర్లో 2 నెలలు తను లండన్ లోనే ఉంటానని… పరోక్షంగా చెప్పాడు. కరీనా గర్భవతి అనే విషయం స్పష్టం అవ్వడంతో… సైఫ్-కరీనా విడిపోతున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

First Published:  3 July 2016 6:36 AM GMT
Next Story