Telugu Global
Cinema & Entertainment

కత్తిలాంటి సినిమా నుంచి డైలాగ్స్ లీక్..

చిరంజీవి సినిమాకు అప్పుడే లీకుల పర్వం మొదలైంది. నిన్నగాకమొన్ననే ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి నెట్ లో లీకుల మీద లీకులు వస్తున్నాయి. సినిమా ఇంకా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తిచేసుకోకముందే చిరు 150వ సినిమాలో డైలాగ్స్ ఇవేనంటూ కొన్ని నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం ఈ డైలాగ్స్ చదువుకుంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 150వ సినిమాలోని చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇదేనంటూ ఓ భారీ డైలాగ్ హల్ చల్ చేస్తోంది. ఆ డైలాగ్ ఏంటంటే.. ‘దుక్కి […]

కత్తిలాంటి సినిమా నుంచి డైలాగ్స్ లీక్..
X

చిరంజీవి సినిమాకు అప్పుడే లీకుల పర్వం మొదలైంది. నిన్నగాకమొన్ననే ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి నెట్ లో లీకుల మీద లీకులు వస్తున్నాయి. సినిమా ఇంకా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తిచేసుకోకముందే చిరు 150వ సినిమాలో డైలాగ్స్ ఇవేనంటూ కొన్ని నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం ఈ డైలాగ్స్ చదువుకుంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

150వ సినిమాలోని చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇదేనంటూ ఓ భారీ డైలాగ్ హల్ చల్ చేస్తోంది. ఆ డైలాగ్ ఏంటంటే.. ‘దుక్కి దున్నడమే తెలుసు వీళ్లకు.. దుర్మార్గం చెయ్యడం తెలియదు. నాగలి పట్టడమే తెలుసు వీళ్లకు.. నరకడం తెలియదు. వీళ్ళ పొలాలకు నీరు ఇవ్వకపోతే.. ఆ నాగలి పట్టిన చేతులే మీలాంటి కలుపు మొక్కలను నరుకుతూ మీ గుండెలను దున్నుకుపోతారు’. ఇలా సుదీర్ఘంగా సాగుతున్న డైలాగ్ రైతులకు, వారి సమస్యలకు దగ్గరగా ఉండటం.. చిరు చేస్తున్న కత్తిలాంటోడు సినిమా కూడా రైతు సమస్యలపై సాగే పోరాటమే కావడంతో.. ఈ డైలాగ్ సినిమాలో చిరు చెప్పిందేనని ప్రచారం జరుగుతుంది. ఈ డైలాగ్ కాకుండా సినిమాలో చిరు చెప్పబోయే డైలాగ్స్ ఇవేనంటూ మరికొన్ని సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.

First Published:  1 July 2016 11:10 PM GMT
Next Story