Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి సినిమాలో కూడా నటించదట...

హీరోయిన్ రెజీనా ఇచ్చిన హాట్ స్టేట్ మెంట్ ఇది. చిరు ప్రస్తుతం 150వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ ఐటెంసాంగ్ కూడా ఉంది. ఈ పాట కోసం రెజీనాను తీసుకున్నారంటూ ఈమధ్య వార్తలు వచ్చాయి. హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఫంక్షన్ లో దొరికిన రెజీనాను ఈ విషయంపై మీడియా ప్రశ్నించింది. దీనికి రెజీనా కాస్త ఘాటుగానే స్పందించింది. తను చిరంజీవి సినిమాలో ఐటెంసాంగ్ చేయడం లేదని స్పష్టంచేసిన రెజీనా… అసలు ఐటెంసాంగ్స్ చేసే ఆలోచనే […]

చిరంజీవి సినిమాలో కూడా నటించదట...
X

హీరోయిన్ రెజీనా ఇచ్చిన హాట్ స్టేట్ మెంట్ ఇది. చిరు ప్రస్తుతం 150వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ ఐటెంసాంగ్ కూడా ఉంది. ఈ పాట కోసం రెజీనాను తీసుకున్నారంటూ ఈమధ్య వార్తలు వచ్చాయి. హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఫంక్షన్ లో దొరికిన రెజీనాను ఈ విషయంపై మీడియా ప్రశ్నించింది. దీనికి రెజీనా కాస్త ఘాటుగానే స్పందించింది. తను చిరంజీవి సినిమాలో ఐటెంసాంగ్ చేయడం లేదని స్పష్టంచేసిన రెజీనా… అసలు ఐటెంసాంగ్స్ చేసే ఆలోచనే తనకు లేదని తేల్చిచెప్పేసింది. ఉన్నన్ని రోజులు హీరోయిన్ గా కొనసాగుతాను తప్ప ఐటెంసాంగ్స్ జోలికి మాత్రం వెళ్లనని రెజీనా క్లారిటీ ఇచ్చింది.

నిజానికి చిరు 150వ సినిమాలోకి ఇప్పటికే క్యాథరీన్ థ్రెసాను తీసుకున్నారు. సరైనోడు సినిమాలో ఎమ్మెల్యేగా నటించి మెప్పించిన క్యాథరీనను… 150వ సినిమాలో ఐటెంసాంగ్ కోసమే తీసుకున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని పరోక్షంగా క్యాథరీన్ కూడా ఒప్పుకుంది. చిరు సరసన తను ఆడిపాడబోతున్నానంటూ అంగీకరించింది. కానీ ఇంతలోనే రెజీనా పేరు కూడా తెరపైకి రావడం… ఆమె ఆ ఆఫర్ ను ఖండించడం కూడా జరిగిపోయాయి. బహుశా… ఇద్దరు ఐటెంభామలతో చిరంజీవి ఐటెంసాంగ్ ను ప్లాన్ చేశారేమో…

Click on Image to Read:

niharika

allu-arjun

tamanna diet

First Published:  1 July 2016 11:20 PM GMT
Next Story