Telugu Global
Health & Life Style

ర‌క్త నాళాల్లో కొవ్వును క‌రిగించే ప్రొటీన్ 

గుండె జ‌బ్బుల‌ను నివారించేందుకు మ‌న శ‌రీరంలోనే స‌హ‌జ సిద్ధ‌మైన వ్య‌వ‌స్థ ఉందా? అంటే అవునంటున్నారు. మిస్సోరీ విశ్వ‌విద్వాల‌య శాస్త్ర‌వేత్త‌లు ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫాక్ట‌ర్-1 అని పిలిచే ఒక ప్రొటీన్ ర‌క్త‌నాళాల్లో కొవ్వుపేరుకు పోవ‌డాన్ని నిరోధిస్తుంద‌ని వీరు తొలిసారి గుర్తించారు. టీనేజ్‌లో అత్య‌ధిక మోతాదులో ఉత్ప‌త్తి అయ్యే ఈ  ప్రొటీన్ వ‌య‌సు మీద‌ప‌డిన కొద్దీ త‌గ్గుతూ వ‌స్తుంద‌ని వారు చెప్పారు. మాన‌వ శ‌రీరంలో ఉండే మాక్రోఫేగ‌స్ అనే తెల్ల‌ర‌క్త‌క‌ణాలు ర‌క్త‌నాళాల్లోని కొవ్వును క‌రిగించే నిత్యం ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు. […]

ర‌క్త నాళాల్లో కొవ్వును క‌రిగించే ప్రొటీన్ 
X
గుండె జ‌బ్బుల‌ను నివారించేందుకు మ‌న శ‌రీరంలోనే స‌హ‌జ సిద్ధ‌మైన వ్య‌వ‌స్థ ఉందా? అంటే అవునంటున్నారు. మిస్సోరీ విశ్వ‌విద్వాల‌య శాస్త్ర‌వేత్త‌లు ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫాక్ట‌ర్-1 అని పిలిచే ఒక ప్రొటీన్ ర‌క్త‌నాళాల్లో కొవ్వుపేరుకు పోవ‌డాన్ని నిరోధిస్తుంద‌ని వీరు తొలిసారి గుర్తించారు. టీనేజ్‌లో అత్య‌ధిక మోతాదులో ఉత్ప‌త్తి అయ్యే ఈ ప్రొటీన్ వ‌య‌సు మీద‌ప‌డిన కొద్దీ త‌గ్గుతూ వ‌స్తుంద‌ని వారు చెప్పారు. మాన‌వ శ‌రీరంలో ఉండే మాక్రోఫేగ‌స్ అనే తెల్ల‌ర‌క్త‌క‌ణాలు ర‌క్త‌నాళాల్లోని కొవ్వును క‌రిగించే నిత్యం ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు. అయితే వ‌య‌సుతో పాటు వీటి సామ‌ర్థ్యం త‌గ్గిపోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ని ఈ ప‌రిశోధ‌న‌ల‌కు నాయ‌క‌త్వం వ‌హించిన శాస్త్ర‌వేత్త యుసుకీ హిగాషీ తెలిపారు. మాగ్రోఫేగ‌స్‌ల‌లో ఐజీఎఫ్‌-1 ప్రొటీన్‌ను పెంచ‌గ‌లిగితే త‌ద్వారా గుండె జ‌బ్బుల‌ను కొంత‌మేర నివారించే అవ‌కాశ‌ముంది. ఎలుక‌ల్లో ఈ ప్రొటీన్ ను త‌గ్గించిన‌పుడు ర‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకు పోవ‌డం ఎక్కువైంద‌న్నారు. మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు చేప‌ట్టి ఫ‌లితాల‌ను నిర్దారించుకున్న త‌రువాత దీని వినియోగానికి తీసుకు రావ‌చ్చ‌ని, ఇందు కోసం 10 సంవ‌త్స‌రాల కాలం ప‌ట్ట‌వ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేశారు.
First Published:  30 Jun 2016 10:37 PM GMT
Next Story