Telugu Global
WOMEN

ద‌ట్ లాంగ్ సైలెన్స్‌... మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌హిళ మ‌నోగ‌తం

రెండు ద‌శాబ్దాల‌కు ముందు వ‌చ్చిన ఈ ర‌చ‌న విద్యావంతురాలైన ప్ర‌తి మ‌హిళ‌నూ పున‌రాలోచ‌న‌లో ప‌డేసింది. అప్ప‌ట్లో మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో మ‌హిళ ఒక అనామిక‌. త‌న‌కంటూ ఒక గుర్తింపు ఏదీ ఉండేది కాదు. దాని కోసం ఆలోచించ‌డం కూడా తెలియ‌నంత అమాయ‌క‌త్వం ఆమెను ఆవ‌రించి ఉండేది.భ‌ర్త‌కు భార్య‌గా, బిడ్డ‌ల‌కు త‌ల్లిగా త‌న బాధ్య‌త‌ల‌ను పూర్తి చేయ‌డంలోనే నిర్విరామంగా శ్ర‌మించ‌డం మాత్ర‌మే తెలిసిన త‌రం అది. తానూ ఒక మ‌నిషిని అని, త‌న‌కూ ఒక పేరు ఉంద‌ని, ఆ […]

ద‌ట్ లాంగ్ సైలెన్స్‌...  మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌హిళ మ‌నోగ‌తం
X

రెండు ద‌శాబ్దాల‌కు ముందు వ‌చ్చిన ఈ ర‌చ‌న విద్యావంతురాలైన ప్ర‌తి మ‌హిళ‌నూ పున‌రాలోచ‌న‌లో ప‌డేసింది. అప్ప‌ట్లో మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో మ‌హిళ ఒక అనామిక‌. త‌న‌కంటూ ఒక గుర్తింపు ఏదీ ఉండేది కాదు. దాని కోసం ఆలోచించ‌డం కూడా తెలియ‌నంత అమాయ‌క‌త్వం ఆమెను ఆవ‌రించి ఉండేది.భ‌ర్త‌కు భార్య‌గా, బిడ్డ‌ల‌కు త‌ల్లిగా త‌న బాధ్య‌త‌ల‌ను పూర్తి చేయ‌డంలోనే నిర్విరామంగా శ్ర‌మించ‌డం మాత్ర‌మే తెలిసిన త‌రం అది. తానూ ఒక మ‌నిషిని అని, త‌న‌కూ ఒక పేరు ఉంద‌ని, ఆ పేరుకు ముందు కాని వెనుక కాని భ‌ర్త పేరు, కొడుకు పేరు చెప్ప ఫ‌లానా … అంటే త‌ప్ప త‌న‌ను గుర్తించ‌ని స‌మాజం గురించి ఒక్క క్ష‌ణం కూడా ఊహించ‌ని మ‌హిళ‌ల కాలం అది. త‌మ అమాయ‌క‌త్వంలోనే జీవితాల‌ను ముగించేస్తున్న ద‌శ అది. వేలాదిలో ఒక‌రో- ఇద్ద‌రో త‌న ఉనికి కోసం త‌పించే వాళ్లు. ఆ త‌ప‌నే వారిని మ‌న‌శ్శాంతికి దూరం చేసేది. అలా మ‌న‌శ్శాంతిని కోలో్ప‌యిన ఒక మ‌హిళ క‌థ *ద‌ట్ లాంగ్ సైలెన్స్‌*.

M_Id_429021_q శ‌శి దేశ్ పాండే క‌లం నుంచి జాలువారిన ఈ మ‌హోన్న‌త‌మైన ర‌చ‌న‌లో ప్ర‌తి అక్ష‌రం అభినంద‌నీయ‌మైన‌దే. ఈ న‌వ‌ల‌లో ప్ర‌ధాన పాత్ర జ‌య‌. ఆమె మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌హిళ‌. భ‌ర్త మోహ‌న్‌, కొడుకు రాహుల్‌, కూతురు ర‌తి. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే వాళ్ల‌ది ముచ్చ‌టైన సంసారం. చ‌క్క‌గా అమ‌ర్చిన యంత్రంలాగ ఎక్క‌డా అప‌శ్రుతి అనేది లేకుండా సాఫీగా సాగిపోతున్న జీవితం. జ‌యలో అక్క‌డే మొద‌లైంది మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌. జీవితం చ‌క్క‌టి యంత్రంలా సాఫీగా సాగ‌డానికి, యాంత్రికంగా సాగ‌డానికి మ‌ధ్య ఉన్న హ‌స్తిమ‌శకాంత‌రం తేడా ఆమెను మ‌న‌సుని నిల‌వ‌నీయ‌లేదు. ప్ర‌శాంతంగా ఉండాల‌ని ఎంత‌గా త‌మాయించుకున్నా మ‌న‌సు ప‌దే ప‌దే ప్ర‌శ్నించ‌సాగింది. అందుకు ఇంట్లో దైనందిన జీవితంలో ఎదుర‌య్యే చిన్న చిన్న సంఘ‌ట‌న‌ల‌న్నీ సంఘ‌టితం కాసాగాయి.

నిజానికి జ‌య సంసార జీవితంలో ఎదుర్కొన్న వాటిని స‌మ‌స్య‌లు అన‌డానికి ఎంత అవ‌కాశం ఉందో… అస‌ల‌వి స‌మ‌స్య‌లే కాదు- అన‌డానికి కూడా అంతే అవ‌కాశం ఉంటుంది. అవి ఎలాంటివంటే… మోహ‌న్ చెడ్డవాడు కాదు. జ‌య ప‌ట్ల దురుసుగా వ్య‌వ‌హ‌రించిందీ లేదు. అలాగ‌ని ప్రేమ కురిపించిన సంద‌ర్భాలు కూడా లేవు. ఒక గ్రుహిణికి ఏం కావాలో వాటిలో దేనికీ లోటు చేయ‌డు. అలాగ‌ని భార్య‌, పిల్ల‌ల ప‌ట్ల ఆస‌క్తినీ క‌న‌బ‌ర‌చ‌డు. ఇంటికి ప‌క్కాగా ఎల‌క్ర్టిఫికేష‌న్ చేయించి క‌చ్చితంగా బిల్లు క‌డుతుంటే య‌జ‌మానిగా త‌న బాధ్య‌త స‌క్ర‌మంగా నిర్వ‌హిస్తున్నాన‌నుకుంటాడు. కుటుంబం విష‌యంలోనూ అలాగే ఉంటాడు.

Long_Silence_by_Shashi_Despజ‌య మాత్రం త‌న పిల్ల‌ల‌కు ప్రేమ‌ను పంచే త‌ల్లిగా, బాధ్య‌తాయుత‌మైన భార్య‌గా, అత్త‌మామ‌ల‌తో గౌర‌వంగా న‌డుచుకునే ఇల్లాలు. ఉత్త‌మ ఇల్లాలు అని స‌మాజం ఒస‌గే కీర్తికిరీటానికి నూటికి నూరుశాతం అర్హురాలు. బంధువుల‌తో ఆప్యాయంగా మెల‌గుతూ భార‌తీయ గ్రుహిణికి ఉండాల‌ని సూచించిన మంచి ల‌క్ష‌ణాల‌న్నీ పుణికి పుచ్చుకున్న పాత్ర‌. వీటికి తోడుగా మ‌ధ్య త‌ర‌గ‌తి జీవితాల‌కు త‌ప్ప‌ని స‌రి అయిన సామాజిక నిబంధ‌న‌లు. ఆ గిరిలో జీవిస్తున్న జ‌య అంత‌ర్లీనంగా త‌న‌కంటూ ఒక గుర్తింపు కోసం త‌పిస్తుంటుంది.

ఐడెంటిటీ క్రైసిస్‌, స్ర్ట‌గుల్ ఫ‌ర్ ఎగ్జిస్టెన్స్‌. వీట‌న్నింటినీ ఇంట్లో ఎదుర‌య్యే సంఘ‌ట‌న‌ల ద్వారా పాఠ‌కుల క‌ళ్ల‌కు క‌ట్టారు ర‌చ‌యిత్రి. శ‌శిదేశ్‌పాండే చిత్రించిన స‌న్నివేశాల్లోని ఒక్కొక్క సంఘ‌ట‌న‌ను, ఆ సంద‌ర్భంలో జ‌య‌లో క‌లిగిన మేధో సంఘ‌ర్ష‌ణ‌ను వ‌ర్ణించిన తీరును గ‌మ‌నిస్తే… అవి దాదాపుగా ప్ర‌తి మ‌ధ్య త‌ర‌గ‌తి ఇంట్లోనూ ఎదుర‌య్యేవే. మౌనంగా ఒక గిరిలో జీవితాన్ని సాగిస్తున్న ప్ర‌తి మ‌హిళ త‌న‌ను తాను జ‌య పాత్ర‌లో ఊహించుకునేట‌ట్లు చేస్తాయి. కొంచెం అటూఇటూగా జ‌య‌లో క‌లిగిన‌టువంటి మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ల‌నే అనుభ‌విస్తూ ఉన్న మ‌హిళ‌లంద‌రినీ ఈ ర‌చ‌న క‌దిలించి వేసింది.

న‌వ‌ల చివ‌రికి వ‌చ్చే స‌రికి జ‌య ఒక స‌మ‌ర్థ నాయ‌కురాలిగా ఎదుగుతుంది.ఈ త‌ర‌హా ముగింపు ప్ర‌తి మ‌హిళ‌కూ నూత‌నోత్సాహాన్ని తెచ్చింది. చిన్న రాయి త‌టాకంలో అల‌ల‌ను రేపిన‌ట్లు … ఈ న‌వ‌ల మ‌హిళ‌ల మ‌న‌సుల్లో అల‌ల‌ను రేపింది. త‌మ‌కూ ఒక మ‌న‌సు ఉంద‌ని, దానికి కొన్ని ఇష్టాలున్నాయ‌ని, త‌న‌కూ ఒక మ‌స్తిష్కం ఉంద‌ని, దానికి ఆలోచించ‌గ‌ల శ‌క్తి ఉంద‌న్న స్ప్ఙ‌హ‌ను క‌లిగించింది. అందుకోసం శ్ర‌మించే ధైర్యాన్నిచ్చిన ర‌చ‌న *ద‌ట్ లాంగ్ సైలెన్స్‌*.

ఇప్ప‌టికీ మ‌న స‌మాజంలో… అనేక మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు అప్పుడు ర‌చ‌యిత్రి అల్లిన స‌న్నివేశాల‌ను నిత్య‌నూత‌నంగా ఉంచుతూనే ఉన్నాయి. ఆ కుటుంబాల మ‌హిళ‌లు జ‌య పొందిన‌టువంటి అనుభ‌వాల‌నే చ‌విచూస్తున్నారు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే అప్ప‌టి జ‌య‌లు ఇప్పుడూ ఉన్నారు. అలాంటి వారికి ఈ న‌వ‌ల మార్గ‌ద‌ర్శ‌నం చేసి తీరుతుంది.

ర‌చ‌యిత్రి గురించి:
పేరు: శ‌శి దేశ్ పాండే
పుట్టింది: 1938, క‌ర్నాట‌క‌లోని ధార్వాడ్‌లో
పుర‌స్కారం: సాహిత్య అకాడ‌మీ అవార్డు (ద‌ట్ లాంగ్ సైలెన్స్‌)

First Published:  29 Jun 2016 5:16 AM GMT
Next Story