Telugu Global
Cinema & Entertainment

అమీర్ ఖాన్ ను టార్గెట్ చేసిన ప్రభాస్

ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జయకేతనం ఎగరేసింది. దాదాపు 6వందల కోట్ల రూపాయల గ్రాస్ కొల్లగొట్టింది. ఇప్పటికే ఎన్నో దేశాల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా బాహుబలి సినిమాను చైనాలో విడుదల చేయబోతున్నారు. మాండరిన్ లోకి మూవీని డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో అమీర్ ఖాన్ ను టార్గెట్ చేశాడు ప్రభాస్. చైనాలో ఇండియన్ సినిమాలు ఆడేవి చాలా తక్కువ. అందులో మెప్పించేవి ఇంకా తక్కువ. అలా […]

అమీర్ ఖాన్ ను టార్గెట్ చేసిన ప్రభాస్
X

ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జయకేతనం ఎగరేసింది. దాదాపు 6వందల కోట్ల రూపాయల గ్రాస్ కొల్లగొట్టింది. ఇప్పటికే ఎన్నో దేశాల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా బాహుబలి సినిమాను చైనాలో విడుదల చేయబోతున్నారు. మాండరిన్ లోకి మూవీని డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో అమీర్ ఖాన్ ను టార్గెట్ చేశాడు ప్రభాస్.

చైనాలో ఇండియన్ సినిమాలు ఆడేవి చాలా తక్కువ. అందులో మెప్పించేవి ఇంకా తక్కువ. అలా అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమా మాత్రమే ఇప్పటివరకు చైనీయుల్ని మెప్పించగలిగింది. మళ్లీ ఇన్నాళ్లకు బాహుబలి సినిమా విడుదలవుతోంది. ఇప్పటికే ప్రపంచ ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంది కాబట్టి… ఇందులోని గ్రాఫిక్స్, స్టోరీలైన్ కచ్చితంగా చైనీయుల్ని కూడా ఎట్రాక్ట్ చేస్తాయని భావిస్తున్నారు.

ఇండియాలో బాహుబలి సినిమా 2వేలకు పైగా స్క్రీన్స్ పై విడుదలైంది. అదే చైనాలో చూసుకుంటే ఈ సినిమా 6500 తెరలపై ప్రత్యక్షం కాబోతోంది. సో… బాహుబలి సినిమాకు చైనాలో హిట్ టాక్ వస్తే… ప్రభంజనం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అదే కనుక జరిగితే… అమీర్ ఖాన్ ను ప్రభాస్ దాటేయడం ఖాయం.

First Published:  28 Jun 2016 9:30 PM GMT
Next Story